Atlee, AA : పుష్ప 2 తర్వాత కూడా.. మాస్ మడతే.
అక్కడే అట్లీ, అనిరుద్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయ్యిందని తేలిపోయింది. ఐతే ఇక్కడ ప్రశ్నేంటంటే అదెప్పుడు..?

It has been confirmed that Bunnys next film after Pushpa 2 is Atlee Story talks were held between them before Jawan Bunny who wanted to see if the jawan was hit gave the green signal when the same thing happened
పుష్ప 2 తర్వాత సాలిడ్ సినిమా చేయనున్న బన్నీ.
పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా అట్లీదే అని కన్ఫామ్ అయ్యింది. జవాన్ కి ముందే వీళ్ళ మధ్య కథా చర్చలు జరిగాయి. జవాన్ హిట్టైతే చూద్దామనుకున్న బన్నీ, అదే జరగటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జవాన్ టీం ని ట్వీట్ తో బన్నీ మెచ్చకుంటే, థ్యాంక్స్ చెప్పిన అనిరుథ్ కి, వట్టి థ్యాంక్సే కాదు, మంచి పాటలు కూడా కావాలంటూ సెటైర్ వేశాడు బన్నీ.
అట్లీ మేకింగ్ లో మూవీ ఓకే కాని ఎప్పుడో తేలలేదా..?
అక్కడే అట్లీ, అనిరుద్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయ్యిందని తేలిపోయింది. ఐతే ఇక్కడ ప్రశ్నేంటంటే అదెప్పుడు? దానికే సమాధానం దొరుకుతోంది. జవనరి 12న ఈ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకెళుతుందట. పుష్ప 2 షూటింగ్ పూర్తైన వెంటనే అట్లీ మేకింగ్ లో బన్నీ.. బిజీ కాబోతున్నాడట.
జనవరి 12 న బన్నీ మాస్ మూవీ మొదలు కానుందా..?
త్రివిక్రమ్ మూవీ మాత్రం సమ్మర్ లో మొదలౌతుంది. అది బోయపాటి శీను సినిమాలు ప్యార్ లల్ గా ప్లాన్ చేసుకున్న బన్నీ, జవనరి నుంచి దసరా వరకు అట్లీ ప్రాజెక్ట్ ని, ఆ తర్వాతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అలానే బోయపాటి సినిమాను చేస్తాడని తెలుస్తోంది. ఇక 2025లో సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఎప్పుడో తేలింది.