Nelson: జైలర్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే..
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ దర్శకుడి కెరీర్ ని మార్చేస్తుంది. బ్లాక్ బస్టర్ పడితే టాప్ లిస్టులోకి వెళ్లిపోతాడు. బడా నిర్మాణ సంస్థలన్నీ లైన్ లోకి వచ్చి మరి ఆఫర్స్ ఇస్తాయి.

It is being discussed that Nelson will make a film with Kamal Haasan, the director of Jailer
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ దర్శకుడి కెరీర్ ని మార్చేస్తుంది. బ్లాక్ బస్టర్ పడితే టాప్ లిస్టులోకి వెళ్లిపోతాడు. బడా నిర్మాణ సంస్థలన్నీ లైన్ లోకి వచ్చి మరి ఆఫర్స్ ఇస్తాయి. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్ నే ఎంజాయ్ చేస్తున్నాడు తమిళ్ డైరెక్టర్ నెల్సన్. రీసెంట్ గా రిలీజైన జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దీలిప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ జైలర్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 400 కోట్లు వసూళ్లు చేసిన ఈ మూవీ సెకండ్ వీక్ లో కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది.
జైలర్ తో రజనీని బౌన్స్ బ్యాక్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. జైలర్ తర్వాత నెల్సన్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జైలర్ సూపర్ హిట్ టాక్ రాగానే కమల్ హాసన్ ఇంటికి పిలిపించుకునిమరి నెల్సన్ ని ప్రత్యేకంగా అభినందించాడు. దీంతో నెల్సన్ నెక్స్ట్ సినిమా కమల్ తోనే ఉంటుందని ఓ టాక్ మొదలైంది. నెల్సన్ కూడా కమల్ కి సరిపోయే కథ ఆల్రెడీ సిద్ధంగా ఉందని గతంలో చెప్పాడు. అయితే కమల్ కంటే ముందు ధనుష్ తో ఒకటి,శింబుతో మరో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే ‘కోలమావు కోకిల’ కంటే ముందు శింబుతో వెట్టై మన్నన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మధ్యలో అపేసాడు నెల్సన్. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా ప్రారంభించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల టాక్. మొత్తానికి జైలర్ తో లైమ్ లైట్ లోకి వచ్చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఎందుకంటే కమల్ ఇప్పుడు ఇండియన్2, కల్కి తో పాటు మణిరత్నంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఇవి కంప్లీట్ అవ్వడానికి ఎలా లేదన్న రెండేళ్లు పడుతుంది. ఇక కెప్టెన్ మిల్లర్ తో బిజీగా ఉన్న ధనుష్.. ఇప్పుడు శేఖర్ కమ్ములతో ఒకటి హిందీలో మరో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. సో అతను కూడా దొరకడం కష్టం. ఫైనల్ గా శింబు అయితే తనకి అందుబాటులో ఉంటాడు. మరి ఈ హీరోతో నెల్సన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడా లేక టాలీవుడ్ హీరోలవైపు ఏమైనా కన్నేస్తాడా అనేది తెలాల్సిఉంది.