Anirudh: ఆస్కార్ రాకున్నా రెహమాన్ కంటే ఎక్కువే.. పవన్ దర్శకుడి రికార్డు..
ఏఆ ర్ రెహమాన్ కి రెండు ఆస్కార్ అవార్డులొచ్చాయి. మూడు నాలుగుకి పైనే హాలీవుడ్ మూవీలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అయినా తన రెమ్యునరేషన్ 8కోట్లే.. కాని మరో తమిళ్ మ్యూజీషియన్ అనిరుధ్ మాత్రం రెహమాన్ కంటే 2 కోట్లు ఎక్కువే తీసుకుంటున్నాడు.. గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ తమిళ సంగీత దర్శకుడి రేంజే ఇప్పుడు మారిపోయింది.

It is known that Anirudh is getting more remuneration than AR Rahman
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ కి అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఆట్లీ మేకింగ్ లో షారుఖ్, నయనతార చేసిన జవాన్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసినందుకుగానూ అనిరుద్ 10 కోట్లు ఛార్జ్ చేశాడట. పవన్ భీమ్లానాయక్ కి తమన్ 4 కోట్లు, మహేశ్ గుంటూరు కారానికి 5 కోట్లు చార్జ్ చేస్తున్నాడు తమన్. ఇక దేవి శ్రీ విషయానికొస్తే, తను పుష్పకి 7 కోట్లు పుష్ప 2 కి 8కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. స్పెషల్ మూవీస్ కి ఇలా వీళ్లు భారీ పారితోషికం తీసుకుంటారు. కాని, యావరేజ్ గా 4, నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తో సర్ధుకుపోతున్నారు దేవిశ్రీ, తమన్..
కాని ఏఆర్ రెహమాన్ రేంజ్ ని ఇంతవరకు తమన్, దేవిశ్రీ రీచ్ అవ్వాలేదు. కాని అనిరుధ్ రీచ్ అవటం కాదు దాటేశాడు. కీరవాణి అంటే రాజమౌళి మూవీకి అందే రెమ్యునరేషన్ ప్రత్యేకం, కాని మిగతా మూవీలకు 3 కోట్లకు మించి తీసుకోడనంటారు.. ఎలా చూసినా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రెమ్యునరేషన్ సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. శశిప్రీతం, శంకర్ ఎహసాస్ లాయ్ కూడా ఇంత మొత్తం తీసుకోవట్లేదు.. అందుకే అనిరుధ్ రెమ్యునరేషన్ లో ఇండియా నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు.