Chiranjevi: భోళా శంకర్ నుంచి రేపు అదిరిపోయే అప్‌డేట్..
వేదాళం రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. రీసెంట్‌గానే సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీ టీం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

It is known that Chitraunit is planning to release the trailer of Bhola Shankar movie starring Megastar Chiranjeevi on 26th of this month.
జూన్ 24న భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన అన్ని అప్‌డేట్స్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు కూడా చేసినట్టు మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా ఓ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. మేకర్స్ ఇస్తున్న వరుస అప్‌డేట్స్‌తో భోళా శంకర్ సినిమా ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్స్‌లో ఉంటోంది. అది మూవీ బిజినెస్‌కు చాలా ప్లస్ అవుతోంది. ఈ సినిమా ఇప్పటికే 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్ నడుస్తోంది.
చిరంజీవి మాస్ లుక్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి క్యారెక్టర్ చేస్తోంది. తమిళంలో వేదాళం కథకు తెలుగులో తీస్తున్న భోళా శంకర్‌కు కాస్త తేడా ఉంటుందని మేకర్స్ ముందే చెప్పారు. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశామన్నారు. ఈ సంవత్సర ఆగస్ట్ 11న సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తమిళంలో హిట్ ఐన ఈ కథ తెలుగులో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.