Mahesh Babu: మళ్లీ వెకేషన్ కి జంప్.. మహేశ్ మనసులో ఏముంది..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకప్పడు వెకేషన్ కి ఫ్యామిలతో కలిసి వెళుతున్నాడంటే ఫ్యాన్స్ కూడా సంబరపడేవాళ్లు.. ఎందుకంటే సినిమా షూటింగ్ పూర్తైతే మహేశ్ అలా వెకేషన్ కి వెళ్లడం అలవాటు. అంటే సూపర్ స్టార్ వెకేషన్ కి వెళుతున్నాడంటే తమ అభిమాన హీరో సినిమా పూర్తైందనే అభిప్రాయానికొచ్చేవాళ్లు ఫ్యాన్స్.

It is known that Mahesh Babu has planned a trip to London to see his son Gautam
కట్ చేస్తే ఈమధ్య మహేశ్ బాబు వెకేషన్ కి టూర్ ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం మొదలైనప్పటి నుంచి షూటింగ్స్ తక్కువ వెకేషన్ టూర్లెక్కువయ్యాయి. అంతా త్రివిక్రమ్ పుణ్యమే. కథ సరిగా రాకనో, షూటింగ్ అనుకున్న ప్రకారం చేయకనో, మహేశ్ ఆగ్రహానికి గురయ్యాడు.
మాటల మాంత్రికుడి ప్లానింగ్ బాలేక, షూటింగ్ ఆగిపోవటంతో, ఆ గ్యాప్ లో ఖాలీగా ఉండలేక ఒకటికి నాలుగైదు ఫారిన్ ట్రిప్పులేశాడు మహేశ్. ఇప్పుడు లండన్ ట్రిప్ అనగానే అంతా గుంటూరు కారం షూటింగ్ మళ్లీ ఆగనుందా అన్న అనుమానాలు పెరిగాయి. కాని వాస్తవం ఏంటంటే మహేశ్ కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతున్నాడు. తనకోసమే మహేశ్ బాబు ఫ్యామిలీ లండన్ ట్రిప్ కి వెళుతోంది. అది కూడా గుంటూరు కారం ప్రజెంట్ షెడ్యూల్ పూర్తవటం వల్లే అని తెలుస్తోంది. 19కి లండన్ వెళ్లి 24 వరకు అక్కడే ఉండి 25 కి హైద్రాబాద్ లో ల్యాండ్ అవతాడట మహేశ్. 26 నుంచి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ షురూ అవుతుందట.