Ram Charan: రాంచరణ్ తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ? రిలీజ్ ఎప్పుడు ?
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. కొందరి ఫస్ట్ మూవీ అడ్రెస్స్ లేకుండా పోతే మరి కొందరికి తొలి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

It is known that Mega Power Star Ram Charan's film under the direction of Buchibabu Sana will be in sports backdrop
ఆ సెకండ్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్కీ డైరెక్టర్ బుచ్చిబాబు సాన. లెక్కల మాస్టర్ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన అయన తొలి చిత్రం ఉప్పెన కొత్త హీరో, హీరోయిన్ లతో చేసిన ఈ లవ్ స్టోరీ ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లోకి చేరి పోయింది. ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి దూసుకుపోయారు. మరి ఈ బాబు సెకండ్ ఫిలిం ఏంటి ? హీరో ఎవరు ? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
గతంలో అయన సెకండ్ మూవీ ఎన్టీఆర్ తోనే అని వార్తలు వచ్చాయి. ఒక సంవత్సరం పాటు ఇదే న్యూస్ చక్కర్లు కొట్టింది. స్టోరీ విషయంలో ఎన్నో చేంజెస్ చేసినా ఎన్టీఆర్ కి బుచ్చి బాబు కి సెట్ అవలేదు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో సినిమా అని ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ క్రెజీ న్యూస్ రాగానే చెర్రీ ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఫిలిం అనలిస్ట్ లు అయితే రకరకాల ఊహాగానాలు స్టార్ట్ చేసారు. ఆ సినిమా ఇలా ఉండబోతోంది.. ఆలా ఉండబోతోంది అంటూ బోలెడన్ని కబుర్లు చెప్పారు.
కానీ రాంచరణ్ గేమ్ చెంజర్ సినిమాలో బిజీ గా ఉన్న కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చెర్రీ ఫాన్స్ నిరీక్షణ ఒక కొలిక్కి వస్తోంది. రాంచరణ్ న్యూ లుక్ లో , స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో విలేజ్ నేటివిటీ తో బుచ్చిబాబు సాన కొత్త చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఒక రెండు నెలలు వర్క్ షాప్ నిర్వహించి ఆ తరువాత రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం చెర్రీ వర్క్ అవుట్ కూడా స్టార్ట్ చేసాడని తెలుస్తోంది.
అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఆలోపు రామ్ చరణ్ తేజ్ గేమ్ చెంజర్ సినిమా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇక ఆర్ సి 16 సినిమా షూటింగ్ కోసమే దాదాపు ఏడాది పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక సినిమా విడుదల అనేది వచ్చే ఏడాది ఉండకపోవచ్చు. 2025 లోనే రామ్ చరణ్ సినిమాని థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.