Pawan Kalyan: పవర్ ఫుల్ శివతాండవం
పవర్ స్టార్ అఘోరగా కనిపిస్తే ఎలా ఉంటుంది.. సన్యాసి పాత్రలో డాన్స్ చేస్తే ఇంకెలా ఉంటుంది. ఆల్రెడీ తొలిప్రేమలో ఓ పాటలో పవన్ బుద్ద సన్యాసి లుక్ లో షాక్ ఇచ్చాడు. ఇప్పడు అఘోరగా కనిపించబోతున్నాడు.

It is known that Pawan Kalyan will be seen in Shiva's getup in his latest project Shambho Shiva Shambho
హిందీ మూవీ ఓ మైగాడ్ కీ సీక్వెల్ గా ఓమైగాడ్ 2 తెరకెక్కింది. అదే ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతోందట. అక్షయ్ చేసిన ఓమైగాడ్ నచ్చే గోపాల గోపాల రీమేక్ లో కృష్ణావతారం ఎత్తాడు పవన్. ఇప్పుడు ఓఎమ్ జీ కి సీక్వెల్ గా ఓమై గాడ్ 2 రాబోతోంది. వచ్చేవారం రిజల్ట్ తేలబోతోంది.
సో.. ఓ మైగాడ్ 2 హిట్టైతే ఇది కూడా పవన్ స్పెషల్ రోల్ లో తెరకెక్కుతుందా అన్న డౌట్స్ వినిపిస్తున్న టైంలో, క్లారిటీ వచ్చేసింది. గోపాల గోపాలలో కృష్ణుడిగా కనిపించిన పవన్, ఓమైగాడ్ 2 తెలుగు రీమేక్ లో శివుడిగా కనిపించబోతున్నాడు. టైటిల్ కూడా శంభో శివ శంభో అని తెలుస్తోంది.
గోపాల గోపాల లో కృష్ణుడిగా, బ్రో లో కాలంగా, శంభో శివ శంభోలో శివుడంటూ దేవుడి అవతారాలతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే పవన్ ప్లానింగ్ అదిరింది. గోపాల గోపాల, బ్రో రెండీంట్లో మెయిన్ లీడ్ వెంకీ, సాయితేజ్ అయితే పవన్ మాత్రం గెస్ట్ లానే సినిమా మొత్తం షాక్ ఇచ్చాడు. సో తక్కువ టైంలో కత్తిలాంటి మూవీ చేయాలంటే ఇలాంటివే కరెక్ట్ కాబట్టి, ఓమైగాడ్ 2 సీక్వెల్ లో శివుడి పాత్రకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.