Rebal Star: మరో క్యూట్ లవ్ స్టోరీ తో మనసులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతోన్న ప్రభాస్.. అమ్మాయిలు జర భద్రం

పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్. ఈ ఇమేజ్ రాక మునుపు ప్రభాస్ అందరికి డార్లింగ్. అమ్మాయిలు పడిచచ్చే ఓ స్వీట్ అండ్ క్యూట్ లవ్ బాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 23, 2023 | 01:58 PMLast Updated on: Jul 23, 2023 | 1:58 PM

It Is Known That Prabhas Is Ready To Make A Film Under The Direction Of Hanu Raghavapudi As The Hero

2004 లో వర్షం సినిమాలో అయన చేసిన వెంకట్ క్యారెక్టర్ ఆయనకి అమ్మాయిలలో పిచ్చ క్రేజ్ తెచ్చేసింది . త్రిష కి ప్రభాస్ కి ఉన్న కెమిస్ట్రీ కి ఎంతో మంది అమ్మాయిలకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసింది . వాన వచ్చినా రాకపోయినా -ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన – అంటూ పాట పాడేసుకున్నారు వాళ్ళు ఆ తరువాత చక్రం , పొర్ణమి సినిమాలు ఓ రేంజ్ లో అలరిస్తే ఎండే ఒక్క పాట పాడండి..అంటూ బుజ్జిగాడు ఓ రేంజ్ లో మనసులను అల్లరి చేశాడు.

ఆ నెక్స్ట్ డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంజుల నిండా ప్రేమను నింపేసి అమ్మాయిలను ప్రభాస్ అంటే పడి చచ్చే స్థాయి కి తీసుకెళ్లాయి ఇక రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఐతే చెప్పనవసరం లేదు పూజాహెగ్డే ప్రభాస్ యాక్ట్ చేసిన ప్రతి సీన్ , ప్రతి సాంగ్ , ప్రతి ఫ్రేమ్ ప్రేమను పంచేసి అందమైన భామలకు నిద్ర లేకుండా చేసాడు ఇప్పుడు ప్రభాస్ అమ్మాయిల మనసులను మరో సారి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు . సీతారామం మూవీ ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని లేటెస్ట్ న్యూస్ . అక్టోబర్ 2 న ప్రభాస్ బర్త్డే సందర్బంగా ఈ క్యూట్ లవ్ స్టోరీ మూవీ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది సో అమ్మాయిలు డార్లింగ్ వచ్చేస్తున్నాడు.. మీ మనసులు జర భద్రం