Prabhas: పవర్ స్టార్ పిలిచాడు.. రెబల్ స్టార్ వచ్చేస్తున్నాడు.. వాటే సీన్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపుతో రెబల్ స్టార్ ప్రభాస్ లో కదలిక వచ్చింది. ఇద్దరు కలిసి నటించే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా ఉంది. అంతటికీ కారణం డైరెక్టర్ సుజీత్, అలానే మాటల మాంత్రికుడేనని తెలుస్తోంది.

It is known that Prabhas will do a guest role in Pawan Kalyan's film
లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రమ్, లియోని లింక్ చేసి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశాడు. ప్రశాంత్ నీల్ సలార్ ని కేజీయఫ్ ని లింక్ చేసి తన సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశాడు. అలానే ఇప్పుడు సుజిత్ కూడా సాహోని, పవన్ ఓజీ ని లింక్ చేశాడట. ఆలస్యంగా సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ మ్యాటర్ లీకైంది.
ఓజీలో వాజీ ఇంపోర్ట్స్ అన్న పేరుతో గోడౌన్ ఉండటం చూస్తుంటే, సాహోకి ఇది లింకుడ్ స్టోరీ అనుకోవాల్సి వస్తోంది. సాహోలో వాజీ అనే ఫిక్షనల్ సిటీ ఉంది.. సో అక్కడి నుంచి దిగుమతులంటే, ఖచ్చితంగా పవన్ ఓజీ మూవీలో ప్రభాస్ సాహో తాలూకు లింక్ ఉన్నట్టే అని తేలుతోంది. ఇక పవన్ పిలుపు మేరకు ప్రభాస్ గెస్ట్ రోల్ వేసుందుకు కూడా ఒప్పకున్నాడట.