Prabhas: నత్తి ప్రభాస్.. ఇదేం పని?
ప్రభాస్ కి నత్తుందా? నత్తి హింసపెడుతోందా? ఫ్యాన్స్ కి ప్రభాస్ కొత్త మూవీ తాలూకు న్యూస్ కిక్ ఇవ్వాలి. కాని షాక్ ఇచ్చేలా ఉంది. మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న అంబాసిడర్ అలియాస్ రాయల్ మూవీలో హీరోకి నత్తి సమస్య ఉంటుందట.

It is known that Prabhas will have a stutter in the film Ambassador Alias Royale directed by Maruti
బేసిగ్గా మారుతి సినిమా అంటేనే హీరోకి ఏదో ఓ జబ్బు ఉండటం కామన్. భలే భలే మగాడివోయ్ లో హీరోకి మతిమరుపు, మహానుభావుడు మూవీలో శర్వానంద్ కి అతి శుభ్రత వ్యాధి, రెండూ కలిసొచ్చాయి. అందుకే అంబాసిడర్ మూవీలో ప్రభాస్ కి నత్తి సమస్య పెట్టాడట డైరెక్టర్ మారుతి.
నత్తంటే లైగర్ లో విజయ్ దేవరకొండ పాత్రకి ఉన్నట్టు.. అదే నత్తే అయితే అసలుకే ఎసరొచ్చేఛాన్స్ ఉంది. ప్రభాస్ మూవీలో కామెడీ కోసం ఏదోచేయబోతే ఇంకేదో అయ్యే అవకాశం ఉంది. కాకపోతే లైగర్ లో హీరోకి నత్తి ఇరిటేటింగ్ గా ఉంటే, ప్రభాస్ అంబాసిడర్ లో హీరో పాత్ర కి నత్తి, కామెడీ తెప్పించేలా ఉంటుందట. డైలాగ్ పూర్తి చేయకపోతే డబుల్ మీనింగ్ వచ్చే అవకాశం ఉన్నటైంలో నత్తితో నవ్వించేలా ప్రభాస్ కి ఆ జబ్బుని ప్లాన్ చేశాడట మారుతి. ఇదే ఇప్పుడు చిత్ర యూనిట్ డైరెక్టర్స్ మాటల్లో లీకైక అంబాసిడర్ మూవీలో ప్రభాస్ పాత్ర తాలూకు సీక్రెట్.