Prabhas: ప్రమాదకరంగా ప్రమోషన్లు.. ప్రభాస్ దర్శకుల రిస్క్..
సలార్ మూవీ యూఎస్లో 1979 సెంటర్స్ లో ప్రివ్యూ వేస్తున్నారని తేల్చిన టీం, ఇండియాలో ఎన్ని ప్రివ్యూలో అఫీషియల్ గా తేల్చలేదు. ఐతే మనదగ్గర 1100 వందల వరకు స్క్రీన్స్ లో సెప్టెంబర్ 27న ప్రివ్యూ వేస్తున్నారట. ఇలా రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 3 వేల స్క్రీన్స్ లో సలార్ ప్రివ్యూ కన్ఫామ్ అయ్యింది.

It is known that Project K will do movie promotions beyond Prabhas Salar's movie promotions
ఇక ప్రీరిలీజ్ ఈవెంట్లు ఆగస్ట్ 15, ఆగస్ట్ 20 ఆగస్ట్ 25, సెప్టెంబర్ 17 అంటూ సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్లని హైద్రాబాద్, విశాఖపట్నం, చెన్నై, ముంబైలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సలార్ సినిమాకే ఇలా ఉందంటే, ప్రాజెక్ట్ కే ప్రీరిలీజ్ ఈవెంట్ల ప్లానింగ్ ప్రమాదకరంగా కాదు, మతిపోగొట్టేలా ఉంది. ఈ గురువారం యూఎస్ లో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ని పోస్టర్ ని కమల్, అమితాబ్, దీపికా సమక్షంలో ప్రభాస్ రివీల్ చేయబోతున్నాడు.
ఆతర్వాత ప్రతీ 2 వారాలకో ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తోంది ప్రాజెక్ట్ కే టీం. వినాయక చవితికి 3 రోజుల ముందు, దసరా, దీపావళి, క్రిస్మస్, ఇలా పండగలతో పాటు ప్రతీ నెల రెండో వారం దేశంలో ఒక్కో పట్టణంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి ప్రమోషన్ పెంచబోతోంది. ప్రతీ ప్రమోషన్ కి ప్రభాస్ హాజరవుతాారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.