Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ ని నమ్మించి.. మోసం చేస్తున్న రాజమౌళి తండ్రి..
రాజమౌళి మేకింగ్ లో సూపర్ స్టార్ సినిమా తాలూకు కథ సిద్దమౌతోంది. ఫైనల్ ఛేంజెస్ చేసి జులై చివరిలోగా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి జక్కన్న చేతిలోపెడతానన్నాడు విజయేంద్ర ప్రసాద్. అంతవరకు బానే ఉంది కాని, పార్ట్ 2 కూడా ఉండేలా కథ కొనసాగిస్తామన్నాడు. అలాంటి క్లైమాక్స్ రెడీ అయ్యిందన్నాడు.

It is known that Rajamouli's father Vijayendra Prasad has backed down on the story of Mahesh's film
అక్కడే డౌట్లు పెరిగాయి. ఓకే రెండు భాగాలుగా ఈమూవీని తెరకెక్కిస్తారంటే బాహుబలి1, 2 లా అనుకోవచ్చు. కాని ఇప్పుడు మహేశ్ బాబు మూవీ ఒకటి తీసి, క్లైమాక్స్ లో సీక్వెల్ కి సూటయ్యేలా సీన్ పెట్టామనటమే మోసం అంటున్నారు. ఒకేసారి రెండు కథలు రాసి, తీయొచ్చు కదా, బాహుబలి రెండు భాగాలుగా అనే కామెంట్లు కూడా పెరిగాయి.
అసలే బాహుబలి 1,2 హిట్ తర్వాత పార్ట్ 3 ఉండొచ్చని కొండంతరాగం తీసి, తర్వాత త్రిబుల్ ఆర్ మేకింగ్ తో బిజీ అయ్యింది జక్కన్నటీం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. తర్వాత త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉండగానే, హైప్ పెంచేందుకు త్రిబుల్ఆర్ 2 అన్నాడు విజయేంద్ర ప్రసాద్, అలానే జక్కన్న. కాని ఏమైంది అవన్నీ గాలిమాటలే అని తేలింది. ఇప్పడు ఊరికే మహేశ్ బాబు మూవీకి రెండు భాగం ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేశాం అనటంటో, ఇక రాజమౌళి ఫాదర్ మాటల మీద జనాలకు నమ్మకం సన్నగిల్లుతోంది. తను సీక్వెల్ పేరు చెబితే అదో పెద్ద జోక్ అయిపోతోంది.