Mahesh Babu: గుంటూరు కారం నుంచి రామ్‌లక్ష్మణ్ ఔట్.. మిగిలేది మహేష్, త్రివిక్రమేనా ?
త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో.. సినిమా చుట్టూ అదే స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. పోటీ పడి సినిమాకు దూరం అవుతున్నారు.

It is known that Ram Laxman is coming out of Guntur Karam movie which is being made by Mahesh and Trivikram combo
త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో.. సినిమా చుట్టూ అదే స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. పోటీ పడి సినిమాకు దూరం అవుతున్నారు. పూజా హెగ్డే నుంచి మొదలైంది. ఆ తర్వాత థమన్ విషయంలో ఇదే టాక్ వినిపించింది.. తర్వాత కెమెరామెన్ కూడా రాంరాం చెప్పేశాడు. ఇప్పుడీ లిస్ట్‌లో ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేను తప్పించి ఆ స్థానంలో శ్రీలీల చేరితే.. కెమెరామెన్‌ను కూడా త్వరలో మార్చబోతున్నారు. ఇలా వరుస ఔట్‌లతో తప్పుకుంటున్నారా.. తప్పిస్తున్నారా అర్థం కాని పరిస్థితి.
సినిమా నుంచి తప్పుకునేందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నా.. మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో గుంటూరు కారం కోసం పనిచేసిన రామ్‌లక్ష్మణ్.. సెకండ్ షెడ్యూల్ నుంచి షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నారట. వీళ్లు ఎందుకు తప్పుకుంటున్నారన్న దానిపై క్లారిటీ లేకపోయినా.. డేట్స్ ఇష్యూనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సినిమా యూనిట్ మధ్య ఏం జరుగుతోంది అన్న సంగతి పక్కనపెడితే.. ఇలా వరుసగా చాలామంది షూటింగ్‌కు దూరం కావడం.. అభిమానులను టెన్షన్ పెడుతోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలకు టాక్ బాగానే వచ్చినా.. కమర్షియల్‌గా హిట్ కాలేదు. గుంటూరు కారంతో ఆ లోటు తీరుద్దాం అనుకుంటే.. వరసు పెట్టి ఔట్ ఔట్ అనడం.. సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయ్.