Rajinikanth: రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..త్వరలో జైలర్‌కు సీక్వెల్ !
తలైవా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు.

It is known that the director is planning a sequel to Superstar Rajinikanth's movie Jailer
తలైవా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ.. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదటి నాలుగు రోజుల్లోనే 3వందల కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. బీస్ట్ లాంటి పరాజయాన్ని అందుకున్నాక నెల్సన్ పై పెద్దగా అంచనాలు లేవు.. ఇంకోపక్క రజినీ సైతం ప్లాప్ ల్లో ఉన్నారు.
వీరి కాంబో నుంచి వచ్చిన చిత్రం.. ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు భయపడ్డారు. కానీ, మొదటి షో రిజల్ట్ రాగానే ఫ్యాన్స్ థియేటర్ లో రచ్చ చేయడం మొదలుపెట్టారు. రజినీ స్వాగ్, స్టైల్ వేరే లెవెల్ అయితే.. ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐతే జైలర్‌కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. ఎండింగ్‌లో విలన్ చెప్పిన డైలాగ్‌తో సీక్వెల్ తీయొచ్చు. దీంతో జైలర్ 2 ఉంటుందా.. ఉంటే ఎప్పుడూ అని క్యూరియస్‌గా ఉన్నారు ఫ్యాన్స్. ఐతే జైలర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు డైరెక్టర్ నెల్సన్. జైలర్ పార్ట్ 2కు ప్లాన్ చేస్తున్నా.. జైలర్ మాత్రమే కాదు తాను డైరెక్ట్ చేసిన కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు కూడా పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. ఈసారి ఈ కథలు అంతకుమించి ఉంటాయి అని చెప్పాడు. అంతే కాకుండా రజినీకాంత్- విజయ్ కాంబోలో ఒక సినిమా చేయాలని తన కోరిక అని.. అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు జైలర్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.