Pushpa 2 – Kannappa : అల్లు అర్జున్ కి పోటీగా మంచు విష్ణు.

ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2024 | 12:36 PMLast Updated on: Jun 19, 2024 | 12:36 PM

It Is Known That The Film Pushpa 2 Which Was Supposed To Release On August 15 Has Been Postponed To December 6

ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘పుష్ప-2’ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు. రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ ను డిసెంబర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో.. ‘పుష్ప-2’ కి గట్టి పోటీనే అవుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అనూహ్యంగా మరో సినిమా తెరపైకి వచ్చింది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’ . మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో మెరవనున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే ‘పుష్ప-2’ వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం పడే అవకాశముంది. ఎందుకంటే ‘కన్నప్ప’ అసలే పాన్ ఇండియా మూవీ. దానికి తోడు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని మ్యాజిక్ చేసినా ఆశ్చర్యంలేదు. అలా అని ‘పుష్ప-2’ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.

అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప-1’.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప-2’ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరి ‘కన్నప్ప’ నిజంగానే డిసెంబర్ లో
విడుదలైతే ‘పుష్ప-2’ ప్రభంజనానికి ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.