Allu arjun : ఆగిపోయిన అల్లు అర్జున్ బిగ్ ప్రాజెక్ట్
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Star director Atlee) కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

It is known that there is a news that icon star Allu Arjun and star director Atlee combination will release a movie.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Star director Atlee) కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక కూడా జరిగిపోయిందని.. అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
‘జవాన్’ (Jaawan) తో పాన్ ఇండియా (Pan India) సక్సెస్ అందుకున్న అట్లీ.. తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నాడని, దాని కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశాడని న్యూస్ వినిపించింది. పైగా ‘పుష్ప 2’ తర్వాత బన్నీ చేయనున్న సినిమా అని టాక్ రావడంతో.. ప్రకటన రాకముందే అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త షాకింగ్ గా మారింది.
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రాజెక్ట్ కోసం అట్లీ తన రెమ్యునరేషన్ గా ఏకంగా రూ.80 కోట్లు డిమాండ్ చేశాడట. తన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘జవాన్’ వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు కొల్లగొట్టడంతో.. అట్లీ తన రెమ్యునరేషన్ ని ఆ స్థాయిలో అడిగాడట. అయితే దర్శకుడు పారితోషికమే అంత ఉంటే.. ఇక మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందని ఆలోచనలో పడిన మేకర్స్.. ప్రస్తుతానికి అసలు ఈ ప్రాజెక్ట్ నే ఆపేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో అట్లీ అదే కథని.. వేరే బ్యానర్ లో, వేరే హీరోతో చేయాలని చూస్తున్నాడట