Prabhas: ప్రభాస్ సినిమాతో అద్భుతం
పాన్ ఇండియా ట్రెండ్ బెండ్ తీసింది బాహబులి. అలా ప్రభాస్ సినిమాతో హిస్టరీ క్రియేట్ అయితే, మళ్లీ పాన్ వరల్డ్ మార్కెట్ కి కూడా ప్రభాస్ మూవీనే కారణమౌతోంది. ఐతే పాన్ వరల్డ్ మార్కెట్ల్ లో అడుగుపెట్టడంతో రాజమౌళి జీవితకాలం లేటు అంటున్నారు.
బాహుబలి తర్వాత కేజీయఫ్, విక్రమ్, పొన్నియన్ సెల్వం, త్రిబుల్ ఆర్ అంటూ ఒక పాన్ ఇండియా మూవీ హిట్టయ్యాక, సౌత్, నార్త్ అంతటా ఈ ట్రెండ్ పెరిగింది. కాని పాన్ వరల్డ్ మూవీ ఇంకా రాలేదు. అది రాజమౌళి మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు.
కాకపోతే మహేశ్ మూవీ కాకుండా ప్రభాస్ మూవీ ఆ అద్భుతం సాధించబోతోంది. ప్రాజెక్ట్ కే నే అన్ని పాన్ వరల్డ్ మూవీల్లో విడుదలయ్యే మొదటి సినిమా. సమ్మర్ లో ప్రాజెక్ట్ కల్కీ 2898 వస్తుంది. తర్వాత సల్మాన్ షారుఖ్ చేసే టైగర్ వర్సెస్ పటాన్, ఆతర్వాత వచ్చే ఏడాది దీపావళికి వార్ 2 వస్తాయి. ఇక కమల్ హాసన్ తో మణిరత్నం ప్లాన్ చేస్తన్న సినిమా క్రిస్మస్ స్పెషల్ గా వచ్చే ఏడాది వస్తుందట. ఇక హను రాఘవపూడీ మేకింగ్ లో ప్రభాస్ చేసే మూవీ కూడా వచ్చే ఏడాది క్రిస్మస్ నే టార్గెట్ చేసుకున్నాయట.
సో రాజమౌళి తో మహేశ్ చేసే పాన్ వరల్డ్ మూవీ వచ్చే లోపు కనీసం ఐదారు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలయ్యేలా ఉన్నాయి. అందులో ఏది హిట్టైతే వాళ్లదే పాన్ వరల్డ్ మార్కెట్ ట్రెండ్ క్రియేట్ చేసిన హిస్టరీ అంటున్నారు. లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ఆ క్రెడిట్ ప్రభాస్ మూవీ కల్కీ 2898 కే దక్కేలా ఉంది.