Chiranjevi: చిరు సినిమా తాలూకు భారీ లీకు.. ఇది పెద్ద జోకు..
మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా స్టోరీ లైన్ లీకైంది. బింబిసార దర్శకుడు వశిష్ట చిరుతో జగదేక వీరుడు అతిలోక సుందరి కాథే మార్చి చెప్పాడట. రివర్స్ స్టోరీ లైన్ తో షాక్ ఇవ్వబోతున్నాడట. ఐతే ఇది ఎప్పటిలా గుసగుసలకే పరిమితం కాలేదు.. ఫిల్మ్ టీమే కావాలని లీకులు వదిలినట్టు తెలుస్తోంది.. ఏది నిజం? టేకేలుక్.

It is reported that director Vashishta is planning to direct Chiranjeevi's Jagadekaveeru Athiloka Sundari with Ram Charan and Janhvi Kapoor
జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ కెరీర్ లోనే మైల్ స్టోన్. ఇది రీమేక్ అయితే రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోనే అన్నారు. కానీ ఈలోపే మళ్లీ చిరునే ఇదే మూవీని రివర్స్ రూట్లో చేయాల్సి వస్తోందట. బింబిసార ఫేం వశిష్ట మేకింగ్ లో చిరు చేసే సినిమా కథ లాక్ అయ్యిందట.
ఇంద్రలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన ఇంద్రజ ఇక్కడే చిక్కుకునే కథని వశిష్ట పూర్తిగా రివర్స్ చేశాడట. హీరో వైఫ్ ని వేరే లోకం నుంచి వచ్చిన వాడు ఎత్తుకెళితే, హీరో అన్ని లోకాలు తిరుగుతూ హీరోయిన్ ని వెతికితే అన్న కోణంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. ఓరకంగా జగదేక వీరుడు అతిలోక సుందరికి, ఎన్టీఆర్ మూవీ జగదేక వీరుడి కథే ప్రేరణ. విచిత్రం ఏంటంటే ఈ సారి జగదేక వీరుడు అతిలోక సుందరి కథని రివర్స్ చేసి, జగదేక వీరుడి కథతో కలిపేసి వశిష్ట భారీ ప్రయోగమే చేస్తున్నాడు
ఇక ఫ్యాన్స్ లోకాని, మరెవరిలో కాని అంచనాలు మరి ఎక్కువ కాకుండా, ముందుగానే వాళ్లని ప్రిపేర్ చేసే కార్యక్రమం కూడా షురూ చేశాడు డైరెక్టర్ వశిష్ట. బింబి సారలో షార్ట్ టూ షాట్, అలానే ప్రమోషన్ విషయంలో రాజమౌలిని ఫాలో అయిన వశిష్ట, ఇప్పుడు కథని ముందే లీక్ చేసి ప్రేక్షకులని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాడనంటున్నారు. చిరు సినిమా కాన్సెప్ట్ ని కావాలనే లీక్ చేస్తున్నారే మాటే ఫిల్మ్ నగర్ లో పెరిగిపోయింది.