Jr. NTR: అటు షారుఖ్, ఇటు హ్రితిక్ మధ్యలో ఎన్టీఆర్.. వాటే కాంబినేషన్..

ఎన్టీఆర్ దేవర మూవీతో బీజ అయ్యాడు. దసరా తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఐతే ఇప్పుడు తారక్ కి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. అదే తన 20 రోజుల టైం అని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2023 | 05:21 PMLast Updated on: Jun 22, 2023 | 5:21 PM

It Is Reported That Junior Ntr Is Playing A Pivotal Role In War 2 Along With Hrithik Roshan And Shahrukh Khan

బ్రహ్మస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ మేకింగ్ లో హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ కన్ఫామ్ అయ్యింది. ఏకంగా 15 నిమిషాల నిడివితో షారుఖ్ కూడా వార్ 2 లో భాగం కాబోతున్నాడట.

నిజానికి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా ఫిల్మ్ టీం ట్రై చేసింది. కాని ఆదిత్య చోప్రా షారుఖ్ కి మొగ్గు చూపాడట.తారక్ సల్మాన్ కి అభిమాని, అయినా వార్ 2 లో షారుఖ్ నే నిర్మాత ఆదిత్య చోప్రా తీసుకోబోతున్నాట. కారణం పటాన్ పాత్రకి, వార్ 2 మూవీ కథతో లింక్ ఉందట. ఏదేమైనా ఒక వైపు హ్రితిక్,మరో వైపు షారుఖ్ మధ్యలో ఎన్టీఆర్ ఆ కాంబినేషనే సెన్సేషనయ్యేలా ఉంది. ఇంకా పట్టాలెక్కముందే ఇన్ని జరిగిపోతున్నాయి.