Mega Star With Bala Krishna: బాలయ్య సెట్లో మెగాస్టార్ చిరంజీవి చర్చ.. క్యా సీన్ హై.?
మెగాస్టార్ చిరంజీవి గురించే ఇప్పుడు బాలయ్య మూవీ భగవంత్ కేసరి సెట్లో చర్చమొదలైంది. అనిల్ రావిపుడు ప్రజెంట్ నటసింహం బాలయ్యతో తీస్తున్న భగవంత్ కేసరి మూవీ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు. హైదరాబాద్ శివార్లలో క్లైమాక్స్ తోపాటు ప్యాచ్ వర్క్ పూర్తిచేస్తున్నాడు. ఇంతలో సెట్లో మెగాస్టార్ మూవీ చర్చ షురూ.

It is reported that the movie has been fixed under the direction of Megastar Chiranjeevi director Anil Ravipudi
అంతటికీ కారణం అనిల్ రావిపుడేనట. మెగాస్టార్ తో అనిల్ రావిపుడి సినిమా ఓక అయ్యిందట. చిరునే పిలిచి కథ సిద్దం చేయమని నెల క్రితం అడగటం, అనిల్ కూడా బేసిక్ స్టోరీ రెడీ చేయటం జరిగింది. అదే కథని భగవంత్ కేసరితో ముడిపెట్టి అనిల్ రావిపుడి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశాడట.
ఇక ఎఫ్ 4 కి కూడా మెగాస్టార్ చిరంజీవి లింకప్ చేసేలా కథ ప్లాన్ చేశాడట. దీంతో భగవంత్ కేసరిలో చిరు పాత్ర ప్రస్తావన, చిరు సినిమాలో బగవంత్ కేసరి ప్రస్థావన ఉండబోతోందట. సంక్రాంతికి సెట్స్ పైకెళ్లే ఈ మూవీ తర్వాతే ఎప్ 4 ఉంటుందని, ఆ లెక్కన వెంకీ, వరుణ్ తేజ్ లు సీన్లు కూడా చిరు మూవీలో ఉంటాయనే చర్చ జరుగుతోంది. మొత్తానికి భగవంత్ కేసరి సెట్లోనే ఈ చర్చ జరగటం, ఇండస్ట్రీ మొత్తం ఈ న్యూస్ పాకటం జరిగిపోయింది.