Pawan Kalyan: త్రివిక్రమ్ కి అహంకారం ..? మందలించిన పవన్ కళ్యాణ్ ..?
త్రివిక్రమ్ కి పిచ్చి పట్టిందా? ఫ్యామిలీ డ్రామాలతో బాక్సాఫీస్ ని ఊపేసే దర్శకుడిగా ఉన్న పేరుని డ్యామేజ్ చేసుకుంటున్నాడా? ఇలాంటి డౌట్లు రావటానికి కారణం రోజుకోరకంగా గుంటూరు కారం మూవీ వివాదాల్లో చిక్కుకోవటం.

It is said that Pawan has warned famous Tollywood director Tivikram Srinivas for not paying attention to his projects
గుంటూరు కారం ఏక్షణాన మొదలైందో కాని, ఫస్ట్ నుంచి సినిమా చుట్టూ వివాదాలే. పూజా హెగ్డేని మహేశ్ వద్దంటే, కావాలని త్రివిక్రమ్ తీసుకున్నాడట. కాని తను ఇచ్చిన 60రోజుల కాల్ షీట్స్ లో ఒక్క రోజు కూడా హీరోయిన్ తాలూకు సీన్లు తీయలేదు. అసలు ఇప్పటివరకు గుంటూరు కారం బైండెడ్ స్క్రిప్ట్ లేదట.
గతంలో ఇలా చేసే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్నాడు త్రివిక్రమ్ అన్నారు. ఇప్పడు మహేశ్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడనంటున్నారు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ వల్ల పవన్ పేరు చెడిపోతోందట. పవన్ సినిమాల కోసం త్రివిక్రమ్ శ్రద్ద పెంచి, మిగతా హీరోలతో కమిటైన సినిమాలు నెగ్లెక్ట్ చేస్తున్నాడనే పేరొచ్చింది. ఇది పవర్ స్టార్ ని ఇబ్బంది పెడుతోందట. అందుకే త్రివిక్రమ్ కి పిలిచి క్లాస్ పీకిన పవన్, ముందుగా తను ఎవరెవరికి కమింట్ మెంట్స్ ఇచ్చాడో ఆ పని పూర్తి చేయమని తేల్చాడట. త్రివిక్రమ్ ని గురువుగా భావించే పవన్, ఇలా పిలిచి రివర్స్ లో క్లాస్ తీసుకున్నాడనే వార్త ఇండస్ట్రీలో వైరలైంది.