Bangalore rave party : ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు

బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఎంత దూమారం లేపిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 11:45 AMLast Updated on: May 27, 2024 | 11:45 AM

It Is Well Known That The Matter Of Bangalore Rave Party Has Raised A Lot Of Noise

 

 

బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఎంత దూమారం లేపిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు. దీనిపై సినీ నటుడు నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో తాను హాజరు అయినట్టు వార్తలు రానందుకు కొంత మంది నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ పేర్కొన్నారు. దీనిపై చాలా మంది నెటి జనులు ఆయన్ను ప్రశ్నలు అడిగారట. ఏంటన్నా ఈ సారి నీ పేరు వినిపించలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అయన్ను ప్రశ్నించారని పేర్కొన్నారు.

నవదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ మౌళి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటున్నారు. దానిలో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇలాంటి రేవ్ పార్టీల విషయం తెరపైకి వస్తే మీ పేరు మొదటగా వినిపించేది. ఈ సారి అదేందుకు జరగలేదు అనే ప్రశ్నను ఓ జర్నలిస్టు అడిగారు. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ జవాబు ఇచ్చారు. అలాగే రేవ్ పార్టీ అంటే ఏంటో చెప్పారు.

మాములుగా రేవ్ పార్టీలు అంటే రేయి, పగలు జరుగుతాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా నిర్వహిస్తారు అని చెప్పారు. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు వారే పాల్గొనడంతో ఇటు తెలంగాణ సర్కార్ సైతం బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ కేసులో మరికొంత పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.