ఆ రూ.1850 కోట్ల లెక్క చెప్పు పుష్ప

ఏ ముహూర్తాన పుష్ప-2 సినిమా రిలీజ్‌ అయ్యిందోగానీ.. ఆ సినిమా వచ్చినప్పటి నుంచీ హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాను దర్శక, నిర్మాతలను కష్టాలు వెంటాడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2025 | 01:35 PMLast Updated on: Jan 23, 2025 | 1:35 PM

It Rides On Pushpa Movie Makers

ఏ ముహూర్తాన పుష్ప-2 సినిమా రిలీజ్‌ అయ్యిందోగానీ.. ఆ సినిమా వచ్చినప్పటి నుంచీ హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాను దర్శక, నిర్మాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. తొక్కిసలాట కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ జైలుకు వెళ్లిరాగా ఇప్పుడు నిర్మాతలను ఐటీ అధికారులు వెంటాడుతున్నారు. సినిమాలో హీరో పోలీసుల కళ్లగప్పి ఎలా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశాడో రియల్‌ లైఫ్‌లో పుష్ప నిర్మాతలకు కూడా అధికారులు కళ్లుగప్పి ఐటీ ఎగ్గొట్టారంటూ వాళ్ల మీద రైడ్స్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు రవిశంకర్‌, నవీన్‌తో పాటు దర్శకుడు సుకుమార్‌ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. పుష్ప 2 వసూళ్లకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. గల్ఫ్ లోని ప్రముఖ సంస్థ నుంచి హవాలా రూపంలో డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు చేరాయనేది ఆరోపణ.

పెట్టుబడి రూపంలో ట్యాక్స్ చెల్లించకుండా 75 పైసల వడ్డీతో 500 కోట్లు ఎన్నారై ఫండ్స్ రూపంలో వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. శాటిలైట్ రైట్స్‌కు వచ్చిన 500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా మొత్తం 2 వేల 300 కోట్ల వసూళ్లు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 400 కోట్లు నిర్మాణానికి ఖర్చు అయింది. మరో 400 కోట్లు థియేటర్ రైట్స్‌కు, ప్రమోషన్స్‌కు పోగా 1500 కోట్ల నికర లాభం వచ్చిందని సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీం అయిన మైత్రీ మూవీ మేకర్స్ 50 శాతం, ప్రధాన నటుడు అల్లు అర్జున్ 30 శాతం, దర్శ కుడు సుకుమార్ 20 శాతం వాటా తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని టాక్‌. ఈ మధ్యలో పిట్టకథలా దర్శకుడు సుకుమార్ తన భార్యతో రెండు సినిమాలు చేయించుకున్నారు. అవే మారుతీ నగర్ సుబ్రమణ్యం, త్వరలో విడుదల కానున్న గాంధీ తాత చెట్టు. వీటి వెనుక చాలా ట్విస్టులే ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది. నష్టాల లెక్కలు చూపించి ట్యాక్సులు చెల్లించకుండా కష్టాలు పడుతున్నట్లు కలరింగ్ ఇ్వూలని చూసినట్టు సమాచారం. పుష్ప హిందీ వెర్షన్‌ను రవీనా టాండన్ భర్త అనిల్ దక్కించుకున్నారు. అయితే, ఇచ్చిన డబ్బులకు, చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉందని ఇన్‌సైడ్ టాక్, మైత్రీ మూవీ సంస్థలో ఫండింగ్ పెట్టి, సినిమాకి క్లాప్ కొట్టిన ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవిపై కూడా ఐటీ దృష్టి సారించింది.

ఆర్బీఐకి ఓ లేఖ ఇచ్చి ఎస్ఆర్ఐ ఫండ్స్ రూపంలో షెల్ కంపెనీల నుంచి ట్యాక్స్ లేకుండా నిధులు తెచ్చుకుని, 75 పైసలకు వడ్డీ చెల్లిస్తున్నట్లు కథలు అల్లారని సమాచారం. వైట్ లో డబ్బులు చెల్లిస్తే టీడీఎస్, జీఎస్టీతో పాటు పర్సనల్ స్లాబ్‌లో వారి ఆదాయానికి 30 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వందలో 30 రూపాయలు ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని బ్లాక్ మనీ హవాలా రూపంలో తీసుకున్నారని తెలుస్తోంది. ఆ మొత్తంతో నటులకు అడ్వాన్స్ రూపంలో వందల కోట్లు మైత్రీ సంస్థ చెల్లించినట్టు సమాచారం. ఇక భూ ములపైనా ఈ నిర్మాతలు డబ్బులను తెగ పెట్టేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లతో పాటు, అమరావతి, వైజాగ్‌లో రిజిస్ట్రేష్‌న్ విలువతో భూములు వైట్‌గా చూపించి, బ్లాక్‌లో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని అగ్రిమెంట్స్ చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి.

కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా. ఈ ట్యాక్స్ ఎగవేత, లెక్కలు చెప్పకుండా తప్పించుకోవడం మాత్రం ఆగడం లేదు. దీంతో ఐటీ అధికారులు పుష్ప టీంను టార్గెట్‌ చేసి సోదాలు నిర్వహించారు. 50 టీంలుగా విడిపోయి అధికారులు 8 చోట్ల సోదాలు చేశారు. ఒక్క పుష్ప-2 సినిమాకే 15 వందల కోట్ల రూపాయల నికర లాభాలకు 18 నుంచి 30 శాతం వరకు వివిధ స్లాబ్స్‌లో పన్నులు చెల్లించాలి. వీరికి డబ్బులు వచ్చినా, తీసుకున్నా కొత్త చట్టాల ప్రకారం కనీసం 25 శాతం ఇవ్వాలి. కానీ ఆ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు లెక్కలు పక్కాగా లేకుండానే తప్పుడు, అధిక లెక్కలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని టాక్‌. గల్ఫ్ దేశాల నుంచి దండిగా హవాలా రూపంలో కరెన్సీ వచ్చిందనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.