ఇది చాలా పెద్ద అవమానం.. పని చేస్తే పరువు తీసేశారే…
పుష్ప 2 రిలీజ్ కి ముందు సునామీ రాబోతోందన్నంత ప్రచారం జరిగింది. కట్ చేస్తే సునామీ కన్ఫామే కాని అది బాక్సాఫీస్ లో కాదు మరో దగ్గరంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పని తనం నచ్చకే పుష్ప2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇద్దరు మ్యూజీషియన్స్ ని రంగంలోకి దింపారు. అందులో తమన్ ఒకడు..
పుష్ప 2 రిలీజ్ కి ముందు సునామీ రాబోతోందన్నంత ప్రచారం జరిగింది. కట్ చేస్తే సునామీ కన్ఫామే కాని అది బాక్సాఫీస్ లో కాదు మరో దగ్గరంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పని తనం నచ్చకే పుష్ప2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇద్దరు మ్యూజీషియన్స్ ని రంగంలోకి దింపారు. అందులో తమన్ ఒకడు.. పిలిచి పనితో పాటు పైకం ఇచ్చారు కదాని, 15 రోజులు కష్టపడి పనిచేస్తే, పనికి విలువ లేదు.. ఊహించని అవమానం జరక్కుండా ఉండలేదు. నిజానికి దేవి శ్రీనే దర్శక నిర్మాతలు అవమానించారంటూ మొన్నటి వరకు సోసల్ మీడియాలో భారీ చర్చ జరిగింది. కట్ చేస్తే తమన్ కి భారీ ఇన్సల్ట్ వెనక పుష్పరాజ్ టీం తప్పే కనిపిస్తోందన్న మాట తూటాలా పేలుతోంది.
పుష్ప 2 వచ్చింది. తెలుగు వర్షన్ కి టాక్ వీకైంది. కాని పాటలకు మాత్రం గట్టి రెస్పాన్సే వచ్చింది. ప్రివ్యూకి సినిమా హిట్టన్న జనమే, మరుసటిరోజుకి నచ్చలేదనొ ముఖం మీదే చెప్పేస్తున్నారు. విచిత్రం ఏంటంటే సెకండ్ హాఫ్ లోకథ బాలేదు, అసలు కథే లేదనే కామెంట్లు వస్తున్నాయి. కాని పాటల మీద మాత్రం పాజిటివ్ టాకే పెరిగింది
దీనికి తోడు పుష్ప 2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బానే మ్యాజిక్ చేసింది. కాని అక్కడే దేవిశ్రీ ప్రసాద్, తమన్న ఇద్దరిలో ఎవరికి అవమానం జరిగిందనే ప్రశ్నే ఎదురౌతోంది. పుష్ప2 రిలీజ్ కి ముందు, టైంకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చేయలేదని, నిర్మాతలు డీఎస్పీని కాదని తమన్ ని, శ్యామ్ సీఎస్ తోపాటు తమన్న ని రంగంలోకి దింపారు.. ఇద్దరూ తమ పని తాము చేసుకుపోయారు
అలా రిలీజ్ కిముందు ఇది దేవి శ్రీకి పెద్ద అవమానంగా మారితే, ఇప్పుడు తమన్ కి అలాంటి అవమానమే జరిగింది. సుకుమార్ అండ్ మైత్రీమేకర్స్ పిలిచి పనిచెప్పారని పదిహేనురోజులు పుష్ప 2 తాలూకు కొంత భాగానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు . కట్ చేస్తే నో యూజ్..
పుష్పా2 రిలీజయ్యాక చూస్తే అసలు తమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపించలేదు. క్రెడిట్స్ లోకూడా తనకి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. మొత్తం క్రెడిట్ అంతా దేవిశ్రీ ప్రసాద్ కే దక్కింది. ఇదే కాదు, అడీషనల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సపోర్ట్ గా శ్యామ్ సీఎస్ కి అడీషనల్ క్రెడిట్ ఇచ్చారు. కాని తమన్ తాలూకు ఎఫర్ట్స్ కి అసలు గుర్తింపేలేదు.
తను కంపోజ్ చేసినబ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వాడిందిలేదు. మొత్తానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లైన దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరిని పుష్ప2 టీం రెండు వేరు వేరు సందర్భాల్లో అవమానించినట్టే కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్లను మార్చి పుష్పీ2 రిలీజ్ కిముందు దేవిని ఇన్ సల్ట్ చేస్తే, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాక తన బీజీఎం వాడకపోవటం, తనకి క్రెడిట్ ఇవ్వకపోవటంతో, ఇలా పుష్ప2 రిలీజ్ అయ్యాక మరో మ్యూజీషియన్ కి అవమానం జరిగిందంటున్నారు.