Prabhas: సలార్ కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..
బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఒకప్పుడు టాలీవుడ్ హీమ్యాన్‌గా ఉండే ప్రభాస్ బాహుబలి తరువాత ఆల్ ఇండియా హీరో ఐపోయాడు.
బాలీవుడ్‌లో అక్కడి హీరోలకు కూడా లేని క్రేజ్ ఇప్పుడు ప్రభాస్‌కు ఉంది. ప్రభాస్ అంటే పడి చచ్చిపోయేవాళ్లు హైదరాబాద్‌లోనే కాదు, ముంబైలో కూడా భారీగానే ఉన్నారు. దీంతో రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నాడు ప్రభాస్. వరుసగా ఫ్లాపులు వస్తున్నా ప్రభాస్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా తగ్గలేదు. బాహుబలి తరువాత చేసిన రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ సినిమాలకు ప్రభాస్ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాకు కూడా అంతే తీసుకున్నట్టు సమాచారం. అయితే సలార్‌లో రెమ్యునరేషన్‌తో పాటు బాక్సాఫీస్ షేర్లలో 10 శాతం తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. పాన్ వరల్డ్ లెవెల్‌లో వస్తున్న సలార్ సినిమా ఖచ్చితంగా 2 వేల కోట్ల బిజినెస్ చేస్తుందని మేకర్స్ ధీమాగా చెప్తున్నారు. సినిమా మీద క్రియేట్ అవుతున్న హైప్ చూస్తుంటే నిజంగానే 2 వేల కోట్లు క్రాస్ చేసేలానే ఉంది. ఇదే జరిగితే అందులో ప్రభాస్ షేర్ 10 పర్సెంట్. అంటే ఈ ఒక్క సినిమాకే ప్రభాస్ దాదాపు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతన్నట్టు లెక్క.