Allu Arjun: పుష్ప 2 రిలీజ్ మరింత ఆలస్యం.. అసలు కారణం ఇదే..
పుష్ప సినిమా తో అల్లూ అర్జున్ కి నేషనల్ అవార్డు వరించింది. దీంతో సినిమాపై మరింత దూకుడు పెంచేందుకు సిద్దమైన డైరెక్టర్ సుకుమార్.

It seems that Pushfa 2 will be further delayed as Allu Arjun won the National Award for the movie Pushpa
పుష్పతో అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడయ్యాడు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే. ఈ జాతీయ అవార్డుతో పుష్ప2 షూటింగ్ మరి ఆలస్యం అవుతుందా. అవార్డుకు.. పుష్ప రిలీజ్‌కు సంబంధం ఉంది. ఇండియా మొత్తం.. 69 జాతీయ అవార్డుల గురించే మాట్లాడుకుంటున్నాయి. 6 అవార్డులతో ఆర్‌ఆఆర్ సిక్సర్‌కొట్టాడు. పుష్పకు ఉత్తమ నటుడు.. సంగీత దర్శకుడు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డు రాకతో పుష్ప2 అనుకున్న టైం కి వస్తుందా? రాదా? అన్న డౌట్ మొదలైంది.
పాన్ ఇండియాగా రిలీజైన పుష్ప ఏ భాషలో రిలీజైతే ఆ లాంగ్వేజెస్‌లో సూపర్‌హిట్ అయింది. ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుందని.. మేకర్స్ కూడా ఊహించలేదు. పుష్ప2 ఒక్కసారిగా హై ఎక్స్‌పెక్టేషన్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి తగ్గట్టు కథను మార్చాడు సుకుమార్. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ నడిచింది. పుష్ప2ను మరింత హిట్ చేయాలన్న భయంతో ఆలస్యమవుతూ వచ్చింది.
జాతీయ అవార్డు రావడంతో.. పుష్ప2 మరింత ఆలస్యం అవుతుందా? అన్న భయం లేకపోలేదు. సినిమాను సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేయాలనుకున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తికావడంతో.. మిగిలిన 30 పర్సెంట్ మరింత బెటర్‌మెంట్ చేయడానికి లెక్కల మాష్టారు టైం తీసుకునే అవకాశం లేకపోలేదు. సినిమాలో ప్రతి సీన్ నచ్చేవరకు డైరెక్టరే కాదు.. హీరో కూడా రాజీ పడడం లేదు. అందుకే 70 శాతం షూటింగ్ పూర్తయినా.. మిగిలిన షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియక రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. అవార్డ్ ఇచ్చిన కిక్‌తో రిలీజ్ లేటైనా ఆశ్చర్యం లేదు.