SSMB29 : ఉగాదికి ఫిక్స్…
తమ అభిమాన హీరోలు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి? ఏ డైరెక్టర్‌తో చెయ్యబోతున్నాడు? హీరోయిన్లు ఎవరు?.. ఇలాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూపిస్తారు. కానీ, హీరో ఎవరు అనేది పక్కన పెట్టి ఒక డైరెక్టర్ నెక్స్‌ట్ ఏం సినిమా చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా చూసే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli).

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
తమ అభిమాన హీరోలు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి? ఏ డైరెక్టర్‌తో చెయ్యబోతున్నాడు? హీరోయిన్లు ఎవరు?.. ఇలాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూపిస్తారు. కానీ, హీరో ఎవరు అనేది పక్కన పెట్టి ఒక డైరెక్టర్ నెక్స్‌ట్ ఏం సినిమా చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా చూసే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli). అతను చేసిన సినిమా రిలీజ్ అయిపోయిందంటే తర్వాత సినిమా ఏమిటి అనే ప్రశ్న వారిలో మొదలవుతుంది. రాజమౌళి ఎనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు.
మహేష్‌బాబు (Mahesh Babu)తో రాజమౌళి (SS Rajamouli) సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తర్వాత ఆ కాంబినేషన్‌లో సినిమా గురించి ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా అని అందరూ ఎదురుచూశారు. మహేష్‌తో తాను సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేయడం, అది ఇండియానా జోన్స్ తరహా సినిమా అని కూడా హింట్ ఇవ్వడం జరిగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని, ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయనేది తాజా అప్‌డేట్. అయితే ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చెయ్యబోతున్నారనే అఫీషియల్ ప్రకటన కోసం ఇప్పుడు మహేష్ అభిమానులు, రాజమౌళి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 9 ఉగాది రోజున ప్రకటిస్తారని తెలుస్తోంది. సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఇందులో నటించే తారాగణం వివరాలు, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలను గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడిస్తారని సమాచారం.