Ram Charan: గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడేనా ?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ గేమ్ చేంజర్. క్రేజీ కాంబినేషన్ కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తొలినాళ్లలో చకచకా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు శంకర్. చరణ్ సినిమా వేగం చూసి అనుకున్న టైంకి వచ్చేస్తోందని ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే.. ఇండియన్ 2.. ఆ తర్వాత రామ్‌చరణ్ భార్య ఉపాసన డెలవరీ అంటూ మూడు నెలలు బ్రేక్ ఇచ్చాడు చరణ్. దీంతో ఆగస్ట్ నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా.. ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను మొదట వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఆ టైమ్ కూడా మారిపోయినట్టుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్‌పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావాల్సింది. కానీ అటు శంకర్‌కు ఇండియన్ 2ను పూర్తి చేయాల్సి ఉండటంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ షురూ కానుంది. ఈ షెడ్యూల్‌తోనే సినిమా దాదాపు కంప్లీట్ అవ్వబోతుందని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. చరణ్ డబుల్ రోల్‌లో నటించనున్నాడు. పొలిటికల్ లీడర్‌గా.. గవర్నమెంట్ ఆఫీసర్‌గా రెండు వెరివేషన్స్‌లో చెర్రీ మెస్మరైజ్ చేయనున్నాడు. మొత్తానికి రిలీజ్‌పై ఓ క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.