సికిందర్ ను రెబల్ స్టార్ తోక్కేస్తాడా…? షేక్ అవుతున్న సల్మాన్
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు చమటలు పడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమాను శాసించిన అక్కడి హీరోలు ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే చాలు తమ సినిమాను రిలీజ్ చేయాలా లేదా అనే విషయంలో భయపడిపోతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు చమటలు పడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమాను శాసించిన అక్కడి హీరోలు ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే చాలు తమ సినిమాను రిలీజ్ చేయాలా లేదా అనే విషయంలో భయపడిపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్… సికిందర్ సినిమా విషయంలో ఇదే భయం నెలకొంది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా సికిందర్ సినిమాను విడుదల చేసేందుకు సల్మాన్ ఖాన్ రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా 10 రోజులకు ప్రభాస్ రాజా సాబ్ సినిమా విడుదల కానుంది. దీనితో తన సినిమా రిలీజ్ ను ముందుకు జరపాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా సౌత్ లో అలాగే నార్త్ లో థియేటర్లు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడు. సౌత్ లో కనీసం థియేటర్లు దొరికే అవకాశం కూడా ఉండకపోవచ్చని సల్మాన్ కంగారుపడుతున్నట్టు తెలుస్తోంది. అటు తమిళంలో కూడా ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉంది.
దీనితో మురుగదాస్ కు ఉన్న ఇమేజ్ కూడా తమిళంలో వర్క్ అయ్యే అవకాశం లేకపోవచ్చు అనే భయం సల్మాన్ ఖాన్ లో ఉంది. కన్నడలో కూడా ప్రభాస్ కు సలార్ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. దీనితో సికిందర్ సినిమా రిలీజ్ ను ముందుకు జరిపే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. కచ్చితంగా 20 రోజులు సికిందర్ సినిమా ఆడే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ సినిమా దెబ్బకు ఆ సినిమా రిలీజ్ ను కనీసం వారం రోజులైనా ముందుకు జరపాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. మరో నెల రోజులు పాటు ముంబైలోనే ఈ సినిమా షూట్ జరగనుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా మీడియా అటెన్షన్ మొత్తం ప్రభాస్ సినిమా పైనే ఉంటుంది. దానికి తోడు కల్కీ సినిమా తర్వాత ప్రభాస్ కు ఓవర్సీస్ లో కూడా భారీ ఇమేజ్ వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ ఏం చేయాలనే దానిపై ఇప్పుడు డైరెక్టర్ మురగదాస్ తో చర్చిస్తున్నాడు. త్వరలోనే సికిందర్ సినిమా రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్ సినిమాలు ఎక్కువగా రంజాన్ కానుక గాని విడుదలయ్యాయి. మరి ఈ సినిమా విషయంలో ఏం చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు.