Sree Leela: పవన్ కళ్యాణ్ కోసం తగ్గింది.. మహేశ్ దగ్గరా నెగ్గింది..
శ్రీలీలా కాల్ షీట్స్ పవన్ కల్యాణ్, మహేశ్ బాబు మూవీ టిక్కెట్టలా మారాయి.. హాట్ కేకుల్లా తన కాల్ షీట్స్ కొనేస్తున్నారు నిర్మాతలు. బేసిగ్గా ఇంత డిమాండ్ ఉంటే ఎవరైనా రెమ్యునరేషన్ పెంచేస్తారు. కాని ఉస్తాద్ భగత్ సింగ్ కి రెండు కోట్లే తీసుకుంటోందట శ్రీలీలా. పూజా హెగ్డే కంటే సగం పారితోషికమే తీసుకుంటోంది తను.
అంతేకాదు సూపర్ స్టార్ మహశ్ బాబు మూవీ గుంటూరు కారంకి కూడా శ్రీలీలా రెండు కోట్లే పారితోషికం తీసుకుంటోందట. నిజానికి పది లక్షల రెమ్యునరేషన్ తీనుకునే తను, బాలయ్య మూవీకి కోటి తీసుకుంది. పవన్, మహేష్ మూవీలకు పారితోషికం పెంచింది. కాకపోతే 3 కోట్ల రెమ్యునరేషన్ ని కోటికి తగ్గించి, అలా పవన్, మహేష్ మూవీల్లో ఆఫర్ పట్టేసింది.
ఇక తన రూట్లోనే మ్రుణాల్ ఠకూర్ నడుస్తోంది. 5 కోట్లకు పెంచిన తన రెమ్యునరేషన్ ని నాని కోసం 3.5 కోట్లు విజయ్ దేవరకొండ కోసం 3 కోట్లకు మార్చిందట. ఇలా మంచి ఆఫర్స్ వస్తే పారితోషికం తగ్గించి మంచి ప్రాజెక్ట్స్ పట్టడంలో ముందుంటున్నారు ఈ ఇద్దరు ముదుర్లు. ఇక జాన్వీ కపూర్ దేవర మూవీకోసం కేవలం 3 కోట్లే తీసుకుంటోందట. అంతా ఎన్టీఆర్ సరసన మెరవాలన్న డ్రీమ్ వల్లే అని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే కి కూడా 25 కోట్ల తీసుకోవాల్సిన దీపికా, కేవలం 11 కోట్లే తీసుకుందట. అంతగా తెలుగు మూవీల కోసం హీరోయిన్లు పారితోషికం తగ్గించుకుంటున్నారు. మంచి ఆఫర్స్ కోసం తగ్గి నెగ్గుతున్నారు.