Big Boss: ఈసారి బిగ్‌బాస్‌ను అంచనా వేయలేరు.. కంటెస్టెంట్లు తెలిస్తే అదుర్స్ అంటారు..
బిగ్‌బాస్.. పరిచయం అవసరం లేని పేరు. ఆ గంభీరమైన గొంతు.. గందరగోళమైన వాతావరణం.. సీజన్ స్టార్ట్ అయిందంటే.. ప్రతీ ఇంట్లో మూడు నెలలు సందడే !

It seems that there are many changes in Bigg Boss season 7, recently a promo with Nagarjuna has been released
ఏ కార్యక్రమాన్ని అయినా తిట్టేవాళ్లు ఉంటారు.. మెచ్చుకునేవాళ్లు ఉంటారు. ఆ ఇద్దరు కలిసి చూసే షో మాత్రం ఒక్కటే.. అదే బిగ్‌బాస్. బుల్లితెర ప్రేక్షకులకి మూడు నెలల పాటు మంచి వినోదం పంచుతున్న షో.. బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఏడో సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ సీజన్ మాత్రం.. గతానికి మించి అనిపించడం ఖాయం అంటున్నారు షో నిర్వహకులు. సరికొత్త రూల్స్, పాపులర్ కంటెస్టెంట్స్, సడెన్ ఎలిమినేషన్స్.. షో మొత్తం గతంతో కంపేర్ చేస్తే పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందట. బిగ్‌బాస్ సీజన్ 7కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. నాగార్జుననే మళ్లీ హోస్ట్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చింది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చెప్పిన మాటలు.. సీజన్ ఎలా ఉండబోతుందన్న దానికి చిన్న టీజర్‌లా వినిపించాయ్.
ఇప్పటివరకు ఆరు సీజన్లు చూసేశాం. నాగార్జున చెప్పిన మాటలని డీకోడ్ చేస్తే.. ఈ సీజన్‌లో భారీ మార్పులే ఉండబోతున్నాయ్. సెలబ్రిటీలు ఏం చేసినా ప్రేక్షకులకు వినోదమే.. బిగ్‌బాస్ సక్సెస్‌కు అదే కారణం. ఆగస్ట్ లాస్ట్ వీక్‌లో బిగ్‌బాస్ 7 ప్రారంభం కాబోతుంది. లాంచింగ్ కూడా ఈసారి డిఫరెంట్‌గా ప్లాన్ చేయబోతున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ సెలిబ్రిటీస్ చాలామంది.. లాంచింగ్ ఎపిసోడ్‌లో మెరవబోతున్నారట. గత ఆరు సీజన్లకు చెందిన కంటెస్టెంట్లు, విన్నర్‌లతో కలిసి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరిని కాంటాక్ట్ చేశారని.. లాంచింగ్ ఎపిసోడ్ ప్లానింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది.
ఇక అటు బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్లు ఎవరు అన్న ఉత్కంఠ జనాల్లో అప్పుడే మొదలైంది. ఇంతకుముందులా కాదు.. ఈసారి ఢిపరెంట్ అని ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసి వదిలారు. దీంతో ఆ సెలబ్రిటీలు ఎవరు.. ఓన్లీ సెలబ్రిటీలే ఉంటారు.. సామాన్యులకు కూడా అవకాశం దక్కుతుందా.. ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయనే డిస్కషన్ జనాలతో పాటు మీడియా ఫీల్డ్‌లో వినిపిస్తోంది. ఐతే ఈసారి బిగ్‌బాస్‌లో గ్లామర్‌డోస్ ఎక్కువగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. టీవీ నటి శోభా శెట్టి, యూట్యూబర్ శ్వేతా నాయుడు.. సింగర్స్ సాకేత్, మోహన భోగరాజుతోపాటు.. సీనియర్ నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమర్‌దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి.. కాంట్రవర్షియల్ జర్నలిస్టు సురేశ్, జబర్దస్త్ బ్యూటీ వర్ష, బ్యాంకాక్ పిల్ల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివరలో హ్యాండ్ ఇచ్చినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.