1000 కోట్ల జాతర కష్టాలు.. దేవర2 లో కూడా ఆ సీన్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. దేవర 2 లో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కోసం కథలో మార్పులు చేస్తున్నారన్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. దేవర 2 లో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కోసం కథలో మార్పులు చేస్తున్నారన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కన్నడ మూవీ కాంతారా ఎఫెక్ట్ కూడా ఈ సినిమా మీద పడేలా ఉంది. దీనికి పరోక్షంగా పుష్పరాజే కారణమని తెలుస్తోంది. పుష్పరాజ్ కోసం సుకుమార్ దగ్గర అసిస్టెంట్లు గా పనిచేసిన ఇద్దరు రైటర్లు కొరటాల శివ టీం తో జాయిన్ అవటమే అందుకు కారణం. ఓవైపు బన్నీనేమో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ అంటూ ఎన్టీఆర్ డైరెక్టర్లు, తారక్ వదిలేసిన కథల చుట్టూ తిరుగుతున్నాడు. ఇక్కడ సీన్ చూస్తే పుష్ప2 వల్ల దేవర 2 లో ఒక మార్పు మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ఉందని తెలుస్తోంది. అదే రిస్క్ అవుతుందా? దేవర 2 ని సూపర్ మాస్ మూవీగా మారుస్తుందా? అన్న డౌట్లు పెరిగినా.. కొరటాల శివ మాత్రం నిర్ణయం తీసుకున్నట్టే ఉన్నాడు… ప్రజెంట్ ఆ మార్పుని తన టీం మాత్రం కన్పామ్ చేస్తోంది… అదేంటోచూసేయండి.
1000 కోట్ల వసూళ్లు ఇప్పుడు ఎలా అయ్యాయంటే, ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ కోసం పోటీ పడ్డ హీరోల్లా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు 1000 కోట్ల నెంబర్ గేమ్ ఆడుతున్నారు. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్టైనా 670 కోట్లే వచ్చాయి. అందుకే వెయ్యికోట్ల క్లబ్ లో సినిమా చేరితే, దర్శకుడిగా రాజమౌళి, సుకుమార్ తర్వాత తన పేరు కూడా పాన్ ఇండియా లెవల్లో మారుమోగాలనుకుంటున్నాడు కొరటాల శివ.
కాబట్టే దేవర2 కోసం కొత్త మార్పులు షురూచేశాడు. ఆల్రెడీ బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ని ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం తీసుకుంటున్నాడు. తన కోసం కథలో చాలా మార్పులుచేశాడు. కట్ చేస్తే ఇప్పుడు కాంతారా ఎఫెక్ట్ నుంచి దేవర కూడా తప్పించుకునేలా లేదని తేలుస్తున్నాడు. నిజానికి కాంతారా ఎఫెక్ట్ నుంచి పుష్పరాజ్ కూడా తప్పించుకోలేదు. పుష్ప ఎంత హిట్ అయినా, పుష్ప2 లో మాత్రం కాంతారా సీన్ ని రెండు సార్లు వాడాల్సి వచ్చింది
గంగమ్మ జాతర సీన్, క్లైమాక్స్ లో మల్లీ అలాంటి సీన్ లోనే యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు. ఎంతగా అంతా కాంతారా సీన్ కాపీ అంటూ కామెంట్స్ చేసినా వసూళ్లొచ్చాయి.. పుష్ప 2 యాక్షన్ ఎపిసోడ్ లు భారీగా పేలాయి. కాబట్టే, ఎవరు ఔనన్నా కాదన్నా,కొన్ని సార్లు ఆడియన్స్ కోసం కొన్ని సీన్స్ చేయక తప్పదు. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి సినిమా నచ్చాలంటే, భక్తి తో పాటు ఇలాంటి సాహసం ఏదోచేయక తప్పదు
కాంతారాలో హీరో పాత్ర, దైవత్వం, ఆ అరుపుతో క్లైమాక్స్ ఇవన్నీ నార్త్ ఇండియాని ఊపేశాయి. ఇక కార్తికేయ 2 మూవీ హిట్ అవటం, హానుమాన్ కూడా నార్త్ ఇండియా పుణ్యమాని 400 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. ఇవన్నీ పరిగనలోకి తీసుకునే ఇప్పుడు అంతా నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల అభిరుచికి తగ్గట్టు కథని రిపేర్లు చేస్తున్నారు. అలా ఆల్రెడీ పూర్తైన దేవర 2 కథని కొరటాల శివ మళ్లీ మార్చాడు.
ప్రజెంట్ తన టీంలో పుష్ప2 రైటర్స్ టీం తాలూకు ఇద్దరు అసిస్టెంట్ రైటర్స్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది. వాళ్లే గంగమ్మ జాతర తరహా సీన్ పడితే తప్ప నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కిక్ ఎక్కదనే సలహా ఇచ్చారట. ఇండస్ట్రీలో ఇప్పడీ డిస్కర్షనే జరుగుతోంది. ఎలాగైనా దేవర 2 తో 1000 కోట్ల క్లబ్ లోచేరాలని కొరటాల శివ చాల గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. నిజానికి దేవర 1 లో కథ యావరేజ్ గానే ఉన్నా, ఎన్టీఆర్ ఇమేజ్, పెర్ఫామెన్స్ పాటలు,యాక్షన్ ఎపిసోడ్ లో మాస్ ఎలిమెంట్స్ సినిమాకు 670 కోట్ల కలెక్షన్స్ తెచ్చాయి. అలాంటిది హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఈజీగా దేవర 2 మూవీ 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అనవసరంగా కొరటాల శివ కంగారు పడి దేవర 2 లో తెగ మార్పులు చేస్తున్నాడనే డిస్కర్షన్ వల్లే, ఈ విషయాలన్నీ మెల్లిగా బయటికొస్తున్నట్టున్నాయి.