షాక్ ఇచ్చిన ఐటీ…? మైత్రీకి 150 కోట్లు, సుకుమార్ కు 45 కోట్ల ఫైన్..?
పుష్ప సినిమా లాభాలు ఇప్పుడు మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు పుష్ప సినిమా నరకం స్పెల్లింగ్ రాయిస్తోంది. ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ మొదలు పెట్టినప్పటి నుంచి
పుష్ప సినిమా లాభాలు ఇప్పుడు మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు పుష్ప సినిమా నరకం స్పెల్లింగ్ రాయిస్తోంది. ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఐటీ అధికారుల రూపంలో ఈ సినిమాకు కష్టాలు వెంటాడటంతో మేకర్స్ ఈ సినిమా అసలు ఎందుకు చేసామో అని తూర్పు తిరిగి దండం పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పుష్ప సినిమా భారీగా లాభాలు తెచ్చిపెట్టడంతో ఐటీ అధికారులు ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టారు.
రెండు రోజుల నుంచి హైదరాబాదులో మకాం వేసిన ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సినిమా వాళ్ళ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ ఐటీ రైడ్స్ లో పాల్గొన్నాయి. నిన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు వారి బ్యాంకు ఖాతాలను అలాగే బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించారు. ఇక ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ ను గట్టిగానే టార్గెట్ చేశారు. నిన్న సుకుమార్ గురించి అసలు ఏ వార్త బయటకు రాలేదు. కానీ అనూహ్యంగా ఈరోజు సుకుమార్ ను టార్గెట్ చేసి ఐటి అధికారులు విచారణ వేగవంతం చేశారు.
విమానాశ్రయంలో ఉన్న డైరెక్టర్ సుకుమార్ ను ఉన్నపళంగా ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఐటి అధికారులు అక్కడ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి కీలక సాక్ష్యాలను సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాకి సంబంధించి సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్.. అలాగే ఆయనకు వచ్చే ఇన్కమ్ పై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇక పుష్ప సినిమాకి సంబంధించి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కు ఐటి చెల్లింపులు చేశాడా లేదా అనేదానిపై ఆరా తీసిన అధికారులు.. దీనికి సంబంధించి కీలక విషయాలను సేకరించినట్లు సమాచారం.
పుష్ప సినిమా భారీగా విజయం సాధించడంతో 1850 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ లెక్కలు నిజమా కాదా అని తేల్చే పనిలో పడ్డ ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ 500 కోట్ల విషయంలో ఐటి పన్ను చెల్లించలేదని గుర్తించినట్టు తెలుస్తోంది. దీనితో మైత్రి మూవీ మేకర్స్ కు 150 కోట్లకు పైగా ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన జరిగిన బిజినెస్ లో సుకుమార్ కు కూడా వాటాలు ఉండటంతో ఆయనను మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించి పన్ను కట్టలేదని గుర్తించారు.
దాదాపు ఈ సినిమాకు ఆయన 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అల్లు అర్జున్ 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని ముందు ప్రచారం జరిగింది. కానీ ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో సోదాలు చేసినప్పుడు అల్లు అర్జున్ కు ఇచ్చింది కేవలం 150 కోట్లు మాత్రమే అని గుర్తించినట్టు సమాచారం. ఇక ఏడాది లెక్కన డైరెక్టర్ అలాగే హీరోలకు మైత్రి మూవీ మేకర్స్ రెమ్యూనరేషన్ పే చేసిందని ఐటి అధికారులు తేల్చారు. 1850 కోట్లలో సుకుమార్ వాటాలు ఎంత అనేదానిపై సరైన పత్రాలు ఇంకా దొరకలేదు. అసలు ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడనే దానిపై కూడా సరైన ఆధారాలు ఐటీ అధికారులకు దొరకలేదని సమాచారం.