Nagarjuna: మరో సారి గెస్ట్ రోల్ కి సిద్ధమవుతున్న నాగార్జున
గెస్ట్ రోల్ చేసేందుకు నాగార్జున సై అంటారా.. నై అంటారా..?

It will be known in the coming days whether Nagarjuna will play a guest role in Shekhar Kammula's film
ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ కత్తిలా ఉండే గెస్ట్ రోల్ చేయడానికి సీనియర్ హీరోలు సై అంటున్నారు. కనిపించేది కొద్దిసేపే అయినా.. కథని మలుపు తిప్పి.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆఫరే నాగ్ ముందుకు వచ్చింది. మరి గెస్ట్ రోల్ కి నాగ్ ఓకే చెబుతాడా? లేక లైట్ తీసుకుంటాడా?
లవ్ స్టోరీతో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ధనుష్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే కథ కహాని రెడీ అయింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం నాగార్జున ని సంప్రదించాడు శేఖర్ కమ్ముల. ఇటీవల కలిసి కథ కూడా వినిపించాడు. తన క్యారెక్టర్ నచ్చడంతో ఎగ్జైట్ అయిన నాగ్ తన ఫైనల్ డెసిషన్ ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ని నాగ్ హోల్డ్ లో పెట్టడానికి ప్రధాన కారణం వందో సినిమా. మలయాళంలో హిట్ అయిన పోరంజు మరియం జోస్ ని విజయ్ బిన్నీ డైరెక్షన్ లో రీమేక్ చేస్తున్నాడు నాగ్. లెక్క ప్రకారం అది నాగార్జున 99వ సినిమా. వందో సినిమాకి కాస్త గ్రాండ్ గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచాలన్నది తన ప్లాన్. అందుకోసం ఓ కథ కూడా సిద్దమైంది. శేఖర్ కమ్ముల సినిమా గనుక ఒప్పుకొంటే.. వందో సినిమా ఆలస్యం అవుతుంది. శేఖర్ కమ్ముల సినిమానే నాగ్ 100వ సినిమా అవుతుంది. అందుకే.. నాగ్ కాస్త డైలామాలో పడినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.