Pushpa2 spl song : పుష్ప2′ లోదిశా పటానీతో ఐటెం సాంగ్‌…

అప్పటి వరకు సమంత అంటే.. గ్లామర్ విషయంలో లిమిటేడ్ అని అనుకున్నారు. కానీ పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌తో హద్దులన్నీ చెరిపేసింది సమంత (samantha). ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ ఈ హాట్ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది. పార్ట్‌ వన్‌కే ఇలా ఉంటే.. సెకండ్ పార్ట్‌లో వచ్చే ఐటెం సాంగ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 10:10 AMLast Updated on: Feb 14, 2024 | 10:10 AM

Item Song With Pushpa2 Lodisha Patani

అప్పటి వరకు సమంత అంటే.. గ్లామర్ విషయంలో లిమిటేడ్ అని అనుకున్నారు. కానీ పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌తో హద్దులన్నీ చెరిపేసింది సమంత (samantha). ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ ఈ హాట్ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది. పార్ట్‌ వన్‌కే ఇలా ఉంటే.. సెకండ్ పార్ట్‌లో వచ్చే ఐటెం సాంగ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్.

ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ (bollywood) బ్యూటీల పేర్లు వినిపించాయి. అందులో దిశా పటాని పేరు బాగా వినిపించింది. ఎందుకంటే పార్ట్ వన్‌లో ముందుగా దిశానే ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ సమంత లైన్లోకి వచ్చిందని అన్నారు. మధ్యలో కృతి సనన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతేకాదు.. దిశా పటానీ, కృతి సనన్ (kriti sanon) ఇద్దరు కూడా పుష్పరాజ్‌తో చిందులేసే ఛాన్స్ ఉందని మాట కూడా వినిపించింది. కానీ ఫైనల్‌గా దిశా పటానీనే ఓకె చేసినట్టుగా తెలుస్తోంది.

మామూలుగానే దిశా పటానీ గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్, బికినీతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడంలో దిశా పటానీ తర్వాతే ఎవ్వరైనా. అలాంటి బ్యూటీకి పాన్ ఇండియా (pan india) సినిమా పుష్ప2లో ఐటెం సాంగ్ అంటే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా సమంతకు మించిన గ్లామర్‌ డోస్‌ను దిశా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) అదిరిపోయే ఐటెం ట్యూన్ ఇచ్చాడట. ఊ అంటావా సాంగ్ కంటే మరింద హై ఓల్టేజ్ ట్యూన్‌తో పుష్ప 2 సాంగ్ (pushpa 2 song) ఉంటుందని అంటున్నారు. మరి సుకుమార్ (sukumarra) .. దిశా పటానీనే ఫైనల్ చేశాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.