Game Changer : గేమ్ ఛేంజర్ రిలీజ్ పై డైలామా..
గేమ్ ఛేంజర్ నుంచి గుడ్ న్యూస్ విని చాలా రోజులే అవుతోంది. ఒకవేళ గుడ్ న్యూస్ చెప్పినా కూడా.. వెంటనే బ్యాడ్ న్యూస్ చెప్పేస్తున్నారు మేకర్స్. దీపావళికి లీక్ అయిన జరగండి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి.. మరోసారి పోస్ట్ పోన్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు.

It's been a long time since I heard good news from the game changer Even if the good news is told the makers immediately tell the bad news
గేమ్ ఛేంజర్ (Game Changer) నుంచి గుడ్ న్యూస్ విని చాలా రోజులే అవుతోంది. ఒకవేళ గుడ్ న్యూస్ చెప్పినా కూడా.. వెంటనే బ్యాడ్ న్యూస్ చెప్పేస్తున్నారు మేకర్స్. దీపావళికి లీక్ అయిన జరగండి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి.. మరోసారి పోస్ట్ పోన్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలోను మెగాఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
త్వరలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెబుతున్నప్పటికీ.. రిలీజ్‌కు మాత్రం చాలా రోజులు వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి రాకపోయినా కనీసం.. సమ్మర్‌లోనైనా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందనే ఆశలో ఉన్నారు చరణ్ ఫ్యాన్స్. కానీ సమ్మర్ కాకుండా.. నెక్స్ట్ ఇయర్ దసరాకే గేమ్ ఛేంజర్ వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్.. మరోసారి వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే.. చరణ్ ఫ్యాన్స్‌కు ఇంతకుమించిన బ్యాడ్ న్యూస్ మరోటి లేనట్టే.
కానీ ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే కాబట్టి.. అభిమానులకు కొంత ఊరటేనని చెప్పాలి. ఇప్పటికైనా శంకర్ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కానీ ముందు ఇండియన్ 2 రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాతే.. గేమ్ ఛేంజర్ డేట్ ఫిక్స్ కానుంది. ఇప్పటికే ఇండియన్ – 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రజెంట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారతీయుడు సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటోంది. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్ ఏంటనేది తెలియడం లేదు. ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా తెరకెక్కిస్తున్నాడు శంకర్. మరి ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.