Kamal Haasan vs Rajinikanth: బిగ్ ఫైట్.. సిల్వర్ స్క్రీన్‌పై రజినీ కమల్ ఫైట్..!
కోలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో పోటీ పడ్డ ఇద్దరు అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్.. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌తో పోటీ పడబోతున్నారు. సూపర్ స్టార్‌గా రజనీకాంత్, లోకనాయకుడిగా కమలహాసన్.. వీరిద్దరి సినీ చరిత్రలు చాలా గొప్పవి.

Kamal Haasan vs Rajinikanth: ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇక.. కోలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో పోటీ పడ్డ ఇద్దరు అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్.. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌తో పోటీ పడబోతున్నారు. సూపర్ స్టార్‌గా రజనీకాంత్, లోకనాయకుడిగా కమలహాసన్.. వీరిద్దరి సినీ చరిత్రలు చాలా గొప్పవి. ఆ ఇద్దరు అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్లో చాలా వరకు క్లాసిక్, ఇండస్ట్రీ హిట్‌లు ఉన్నవే.. అలాంటి సినిమాల్లో కమల్ నటించిన ఆళవంధన్ (తెలుగులో అభయ్) సినిమా ఒకటి.
Kantara: Chapter 1: ఉగ్రరూపం.. హాలీవుడ్ రేంజ్‌లో కాంతార-2..
ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకున్నా కూడా కమల్ నటన విషయంలో ప్రేక్షకులకు ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాను డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు మళ్లీ తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఇక రజినీకాంత్ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న సినిమా ముత్తు. ఈ చిత్రంలో ముత్తుగా రజనీ చేసిన రచ్చ ఇప్పటికీ మర్చిపోలేనిది. అప్పట్లో ఆల్ ఇండియా రికార్డులను సైతం బ్రేక్ చేసింది ముత్తు సినిమా. ఇప్పుడు ఈ సినిమాను కూడా డిసెంబర్ 8నే రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంధిక స్క్రీన్స్‌లో రీ రిలీజ్‌కి సిద్ధం చేశారు.
ఈ మధ్య కాలంలో ఏ సినిమాలకు దక్కని భారీ రీ రిలీజ్ ఈ రెండు సినిమాలకు దక్కబోతున్నాయి. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఇద్దరు సూపర్ స్టార్స్ మళ్లీ ఇలా రీ రిలీజ్‌తో పోటీ పడడంతో.. క్రేజీ స్టార్స్ సినిమాల రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.