తీవ్ర రక్తస్రావం యాంకర్ రష్మికి ఏమైందంటే…!
జబర్దస్త్ ఫేం యాంకర్ రష్మికి ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్‌లో ఆపరేషన్ గౌన్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రష్మి. తాను జనవరి నుంచి ఓ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పింది.

జబర్దస్త్ ఫేం యాంకర్ రష్మికి ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్‌లో ఆపరేషన్ గౌన్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రష్మి. తాను జనవరి నుంచి ఓ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పింది.
తీవ్రమైన భుజం నొప్పి, రక్తస్రావం ఈ రెండు సమస్యలు తనను వేధిస్తున్నట్టు రష్మి రాసుకొచ్చింది. చాలా కాలం నుంచి బాధ ఉన్నా.. మార్చి 29 నాటికి తన పరిస్థితి పూర్తి క్షీణించిందని చెప్పింది. డాక్టర్ల సూచనతో ఏప్రిల్ 18న ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానంటూ హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది.https://www.instagram.com/rashmigautam/p/DIp5CdhS7Q1/?hl=en