జాబిలమ్మ నీకు అంత కోపమా..’ ఎంత క్యూట్ ప్రేమ కథో తెలుసా..?

ఈ మధ్య హీరోగానే కాకుండా దర్శకుడుగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అక్కడ కూడా వరుస విజయాలు అందుకుంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 10:56 AMLast Updated on: Feb 22, 2025 | 10:56 AM

Jabili Antha Neeku Antha Kopama Review

ఈ మధ్య హీరోగానే కాకుండా దర్శకుడుగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అక్కడ కూడా వరుస విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా ఈయన దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చింది. అఫ్ కోర్స్ ప్రమోషన్ పెద్దగా చేయలేదు అనుకోండి..! మరి ఈ సినిమాతో దర్శకుడుగా ధనుష్ హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా చూద్దాం పూర్తి రివ్యూలో..

కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో పవిశ్.. ఈ కుర్రాడు ఎవరో కాదు ధనుష్ కు సొంత అక్క కొడుకు అంటే మేనల్లుడు అన్నమాట. పవిష్ ఒక చెఫ్.. తన ఫ్రెండ్ పార్టీలో కుక్ చేయడానికి వెళ్ళినప్పుడు హీరోయిన్ అనీఖా సురేంద్రన్ ను చూస్తాడు. చూడగానే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది.. మనోడి వంటలకు అమ్మాయి ఫ్లాట్ అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కట్ చేస్తే అనీఖా కొన్ని వేల కోట్లకు వారసురాలు. ఈ విషయం మన హీరోకు తెలియదు. తన లవ్ మ్యాటర్ తండ్రి శరత్ కుమార్ కు చెప్తుంది హీరోయిన్. దాంతో ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురా అని చెప్తాడు. వచ్చాక అన్ని సినిమాల్లో చూపించినట్టే నువ్వు నాకు నచ్చలేదు అని హీరోకు చెప్తాడు శరత్ కుమార్. కానీ కూతురు కోసం కొన్నాళ్లు ఆ కుర్రాడితో ట్రావెల్ చేయడానికి ఒప్పుకుంటాడు.

ఈ క్రమంలోనే హీరోయిన్ ఫాదర్ గురించి హీరో పవిష్ కు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అది తెలిశాక హీరోయిన్ ను వదిలేసి వెళ్ళిపోతాడు హీరో. మరోవైపు తనను ఎందుకు వదిలేసాడో తెలియక పవీష్ మీద కోపంతో పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా.. తన పెళ్లి కార్డు హీరోకి పంపిస్తుంది అనీఖా. ఆ తర్వాత ఏం జరిగింది వాళ్ళిద్దరూ కలిసారా.. అసలు హీరోయిన్ తండ్రి గురించి హీరోకు తెలిసిన ఆ భయంకరమైన నిజం ఏమిటి అనేది మిగిలిన కథ..

కథనం విషయానికి వస్తే.. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ తీయాలంటే కాంప్లికేటెడ్ కథలే అవసరం లేదు. క్యూట్ మూమెంట్స్ ఉంటే చాలు వర్కౌట్ అవుతుంది సినిమా. ఈ విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు ధనుష్. ఆయన తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చాలా క్యూట్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలిసిన కథనే ఎంతో అందంగా చెప్పాడు ధనుష్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి.. వేల కోట్ల ఆస్తులు ఉన్న డబ్బున్న అమ్మాయి మధ్య ప్రేమ కథ ఇది. సింపుల్ లైన్ రాసుకున్నా.. స్క్రీన్ ప్లేలో చాలా మ్యాజిక్ చేశాడు ధనుష్. ఫస్టాఫ్ అంత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మీద సరదాగా గడుస్తుంది. సెకండాఫ్ అంతకుమించి సరదాగా ఉంది. ఈ కథ కాస్త కన్ఫ్యూజ్ అయితే.. ఎటు పోతుందో కూడా అర్థం కాదు. కానీ స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్నాడు ధనుష్. సినిమా అంతా ఓక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. హీరో, అతని ఫ్రెండ్స్ మీద వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. గత ఏడాది వచ్చిన ప్రేమలు ఎలాగైతే సరదాగా వెళ్ళిపోయిందో అచ్చంగా జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా అలాగే సాగిపోయే సరదా ప్రేమ కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కొత్త కుర్రాడు, ధనుష్ మేనల్లుడు పవిష్ అద్భుతంగా నటించాడు. స్క్రీన్ మీద ఈ కుర్రాడుని చూస్తుంటే అచ్చం ధనుష్ ను చూస్తున్నట్టే ఉంది. హీరోయిన్ అనీఖా సురేంద్రన్ కూడా బాగుంది. కాకపోతే ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఎందుకు హీరోయిన్ ఫీల్ కలగలేదు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మ్యాథ్యు థామస్ స్ట్రెస్ బస్టర్. మిగిలిన హీరో బ్యాచ్ కూడా బాగానే ఉంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ చేసింది చిన్న క్యారెక్టర్ అయినా కూడా బాగా పేలింది.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. సింపుల్ సీన్ ను కూడా తన బిజిఎంతో హైలైట్ అయ్యేలా చేశాడు. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ధనుష్ డైరెక్షన్ పీక్స్ లో ఉంది. పవర్ పాండి, రాయన్ సినిమాల తర్వాత దర్శకుడిగా ధనుష్ హ్యాట్రిక్ అందుకున్నట్టే. ఓవరాల్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా.. క్యూట్ లవ్ స్టోరీ.. జస్ట్ ఎంజాయ్..