జాక్ కలెక్షన్స్.. నెక్స్ట్ లెవెన్.. సిద్దు జొన్నలగడ్డ ఇది అస్సలు ఊహించి ఉండడు..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్. మొన్న ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన సినిమా కావడంతో కచ్చితంగా దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 07:10 PMLast Updated on: Apr 12, 2025 | 7:10 PM

Jack Collections Next Eleven Siddu Jonnalagadda Would Never Have Imagined This

సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్. మొన్న ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన సినిమా కావడంతో కచ్చితంగా దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేదు ఈ సినిమా. నాలుగేళ్ల కింద వచ్చిన డీజే టిల్లు మొదటిరోజు నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.. ఇక రెండేళ్ల కింద వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకు ఫస్ట్ డే ఏకంగా 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ చూసిన తర్వాత జాక్ కచ్చితంగా 10 కోట్ల ఓపెనింగ్ తీసుకొస్తుందని సిద్దు కూడా బలంగా నమ్మాడు. కానీ సినిమాకు టాక్ తేడాగా రావడం.. టిల్లు స్క్వేర్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇందులో లేకపోవడంతో సినిమా దారుణంగా బోల్తా కొట్టింది.

ఆ రెండు సినిమాలు తీసుకొచ్చిన కలెక్షన్స్ నమ్మి.. జాక్ సినిమాకు దాదాపు 18 కోట్ల బిజినెస్ చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 19 కోట్ల షేర్ రావాలి.. అంటే 40 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనీసం 10 కోట్ల షేర్ అయినా వస్తుందా అనేది అనుమానమే. ఇంకా మాట్లాడితే 10 కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టమే. ఈ లెక్కన టిల్లు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ తోనే సిద్దు జొన్నలగడ్డ గత సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం అర్థం అవుతుంది. టిల్లు క్యూట్ తీస్తే మళ్లీ అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయం.. కానీ సిద్దు జొన్నలగడ్డ సినిమాకు మాత్రం ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావు. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ ఉన్నది టిల్లు అనే క్యారెక్టర్ కు.. సిద్దు జొన్నలగడ్డకు కాదు. ఈ విషయం సిద్దుకు త్వరగానే అర్థం కావాలి.. లేదంటే కెరీర్ మరింత దారుణంగా మునిగిపోవడం ఖాయం.

ఎందుకంటే ఈయన నెక్స్ట్ సినిమా తెలుసు కదా ప్యూర్ లవ్ స్టోరీ. నీరజ కోన ఈ సినిమాకు దర్శకురాలు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జాక్ లాంటి మాస్ సినిమాకి ఓపెనింగ్స్ రాలేదు అంటే తెలుసు కదాకు వస్తాయి అనుకోవడం అత్యాశే అవుతుంది. తన కెరీర్ కు మరో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు టిల్లు క్యూబ్ ఒక ఆయుధంలా వాడుతాను అని చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ. చూస్తుంటే ఆ టైం వచ్చేసినట్టే కనిపిస్తుంది. మరోవైపు మనోడితో సినిమాలు చేయడానికి దర్శకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం హీరోగానే కాకుండా రైటర్ గా మారి.. కథలో వేలుపెట్టి దర్శకులను బాగా డిస్టర్బ్ చేస్తాడు అనే పేరు సిద్దు మీద ఉంది. తాజాగా విడుదలైన జాబ్ సినిమాలో కూడా డైలాగ్స్ విషయంలో పూర్తిగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ హీరోకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ టైంలో చాలాసార్లు ఇద్దరికీ గొడవ అయినట్టు కూడా ప్రచారం బాగానే దీని వాళ్ళిద్దరూ ఏదో నవ్వుతూ హేండిల్ చేశారు కానీ వాళ్ళు చెబుతున్న ఆన్సర్స్ లోనే ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగింది అనే విషయం అర్థం అవుతుంది. మరి చూడాలిక సిద్దు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..!