Ram Charan: జగదేక వీరుడున్నాడు.. అతిలోక సుందరి దొరికింది.. కాని… !
జగదేక వీరుడు అతిలోకసుందరి మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టర్.. అలాంటి మూవీకి సీక్వెల్ రావాలని, వస్తుందని ఎప్పడినుంచో అంతా కోరుకున్నారు. ఇప్పుడదే నిజమయ్యేలా ఉంది. నిర్మత అశ్వినీ దత్ కుమార్తెలిద్దరూ సీక్వెల్ కి సిద్దం అన్నారు.

Jagadeka Veerudu Athiloka Sundari
అన్నట్టుగానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని ఎప్పుడో అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఇక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రస్ట్ చూపిస్తోంది.. అసలు అశ్వినీదత్ కూమార్తెలిద్దరు, జాన్వీని జగదేక వీరుడు అతిలోక సుందరితోనే టాలీవుడ్ కి పరిచయం చేయాలనున్నారు. కాని కథ, కథనం, దర్శకత్వం దగ్గరే బ్రేకులు పడుతున్నాయట.
రాఘవేంద్ర రావు సలహా ఇది తీస్తే నాగ్ అశ్విన్ కాని, రాజమౌళి కాని తీయాలని.. అయితే జక్కన్న మహేశ్ బాబు మూవీతో కనీసం రెండు మూడేళ్లు బిజీ అవుతాడు. నాగ్ అశ్విన్ మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరంటే కంగారు పడుతున్నాడట. ప్రభాస్ తోప్రాజెక్ట్ కే తీస్తున్న నాగ్ అశ్విన్ ఆ సినిమా తర్వాత తీస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్ చేయొచ్చట. కాకపోతే కథ అనుకున్నట్టు వస్తేనే అని చెప్పాడట.. ఇది చెర్రీ, జాన్వీ కాంబినేషన్ లో తెరకెక్కే అవకాశం ఉన్న జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఫ్యూచర్.