జానీ మాస్టర్ ను టార్గెట్ చేసిన జగన్…?

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. జాని మాస్టర్ పై రేప్ కేసు నమోదు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 02:42 PMLast Updated on: Sep 16, 2024 | 2:42 PM

Jagan Targeted Johnny Master

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. జాని మాస్టర్ పై రేప్ కేసు నమోదు చేసారు. పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో సెక్షన్ 376 రేప్ కేసులో పాటు క్రిమినల్ బెదిరింపు (506) గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. పలు హిట్ సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ కేసు వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. జానీ మాస్టర్ గత కొన్నాళ్ళుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ మేరకు ఆయన వీడియో లు కూడా విడుదల చేస్తున్నారు. చేసే విమర్శలు కూడా ఘాటుగానే చేస్తున్నారు జానీ మాస్టర్.

దీనితో వైసీపీ జానీ మాస్టర్ ను టార్గెట్ చేసి ఉండవచ్చు అంటున్నారు కొందరు. ఆయన మాటల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండవచ్చే కామెంట్స్ వస్తున్నాయి. ఇక వైసీపీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ వైసీపీ ఫ్యాన్స్ జానీ మాస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ను కంట్రోల్ చేయడానికే వైసీపీ గురి పెట్టి కొట్టింది అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ వ్యవహారం సంచలనం అవుతోంది. ఈ కేసు విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.