జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ హీరోల కొత్త స్లోగన్.. బయట పడట్లేదంతే..!
పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంతుందో చెప్పాలంటే కొత్తగా ఏదైనా మిషన్ కనిపెట్టాలి. హీరోగా ఉన్నప్పుడే ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు.. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా.

పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంతుందో చెప్పాలంటే కొత్తగా ఏదైనా మిషన్ కనిపెట్టాలి. హీరోగా ఉన్నప్పుడే ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు.. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా. ఇలాంటి సమయంలో ఆయన క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇలాంటి పవన్ వెంట కేవలం అనుచరులు, అభిమానులు మాత్రమే కాదు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాకపోతే ఎవరికి వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లా బయటకు రావట్లేదు అంతే. పవన్ కళ్యాణ్ కు బాహాటంగా సపోర్ట్ చేస్తే ఎవరు ఏమనుకుంటారో అనే సందిగ్ధంలో ఉండి.. లో లోపల జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటున్నారు. కొందరు మాత్రం బయటకు వచ్చి పవన్ మీద తమకు ఉన్న అభిమానం చెప్తున్నారు. ఎవరి వరకో ఎందుకు.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షాత్తు చిరంజీవి కూడా తమ్ముడి పార్టీకి బహిరంగంగా సపోర్ట్ చేయలేదు. అదే చిరంజీవి ఇప్పుడు ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటున్నాడు. మెగా హీరోలు మొత్తం పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు ఒక అల్లు అర్జున్ తప్ప.
మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వెంట ఉండడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. తమలో ఒకడు రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడ చక్రం తిప్పుతున్నాడు అంటూ గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నారు. అన్నింటికి మించి ఏపీలో సినిమా రంగానికి, తెలుగు ఇండస్ట్రీకి తన వంతు సాధించడానికి ఎప్పుడు ముందుంటున్నాడు పవన్. అందుకే అవసరం కోసం కొంతమంది.. అభిమానంతో మరి కొంతమంది జై జనసేన అంటున్నారు. ఏపీలో వైయస్ జగన్ సర్కార్ నడుస్తున్నప్పుడు.. ఏ ఒక్కరు కూడా జనసేన గురించి కానీ పవన్ గురించి గానీ, ఓపెన్ గా మాట్లాడింది లేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట తీరు మారింది.. ఏకంగా సినిమా ఈవెంట్స్ లో కూడా 30 ఇయర్స్ పృథ్వి, హైపర్ ఆది లాంటి వాళ్ళు పాత ప్రభుత్వంపై పంచులు వేస్తూ.. కొత్త ప్రభుత్వంపై, అందులోనూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో అందరు హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట నడిచారు అనడంలో సందేహం లేదు. పైగా ఎన్నికల ప్రచారంలో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు జనసేనాని. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా చాలామంది హీరోల పేర్లు పవన్ ప్రచారంలో పదేపదే వినిపించాయి. అవి కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ అయ్యాయి. ఇంకా ఇండస్ట్రీ వాడు కాబట్టి పవన్ మావాడు అంటూ అందరూ అక్కున చేర్చుకుంటున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ ప్రభంజనం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.