Nelson Dilipkumar: అనిరుధ్ లేకపోతే నెల్సన్ కుమార్ లేడా..? జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ బయోగ్రఫీ..
ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్‌తో డ్యాన్సులు వేయిస్తోందీ జైలర్. సూపర్‌స్టార్ రజనీని సరికొత్తగా ప్రజెంట్ చేసి.. ఆయనకు మంచి హిట్ అందించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
Nelson Dilipkumar: బాక్సాఫీసు వద్ద జైలర్ హవా కొనసాగుతోంది. కలెక్షన్లలో సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోందీ మూవీ. రజనీ ఈజ్ బ్యాక్ అంటున్నారు మూవీ చూసిన ప్రతీ ఒక్కరు. ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్‌తో డ్యాన్సులు వేయిస్తోందీ మూవీ. సూపర్‌స్టార్ రజనీని సరికొత్తగా ప్రజెంట్ చేసి.. ఆయనకు మంచి హిట్ అందించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ మూవీ నెల్సన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు అందరి చూపు నెల్సన్ మీదే పడింది.
అయన ఎవరు..? ఇది అయన ఎన్నో సినిమా..? ఇంతకుముందు ఏం చేశాడు..? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. నెల్సన్ పూర్తి పేరు.. నెల్సన్ దిలీప్ కుమార్. చెన్నైలో పుట్టాడు. న్యూ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీ చేశాడు. కొద్దిరోజులు స్టార్ విజయ్ చానెల్‌లో అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. 2010లో వెట్టైమన్నన్ అనే చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. శింబు, హన్సిక హీరోహీరోయిన్లుగా మూవీ కూడా స్టార్ట్ అయింది. ఐతే సడెన్‌గా ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లు ఖాళీగా ఉన్నాడు నెల్సన్. ఎక్కడా నిరాశపడకుండా సినిమా గురించి మరింత తెలుసుకున్నాడు. మేకింగ్, ఫ్రేమింగ్, టేకింగ్ మీద మంచి పట్టు సంపాదించాడు. ఐతే 2017లో మళ్లీ ఓ మూవీ ప్లాన్ చేశాడు. అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాడు. అది కూడా పట్టాలెక్కలేదు. ఐతే ఈ ప్రయత్నంలో నెల్సన్‌కి అనిరుధ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. లైకా ప్రొడక్షన్స్‌కు నెల్సన్‌ను పరిచయం చేశాడు అనిరుధ్. అలా కొలమావు కోకిల మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. నయనతార హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ డార్క్ కామెడీ ఫిల్మ్ సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా కోకో కోకిల పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది. నెల్సన్ రెండో మూవీ.. డాక్టర్. శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. 2020 నవంబర్‌లో నెల్సన్‌ను హీరో విజయ్‌కు పరిచయం చేశాడు అనిరుధ్. నెల్సన్ స్కిప్ట్‌కు విజయ్ ఓకే చెప్పాడు. అలా వచ్చిందే బీస్ట్ మూవీ. బీస్ట్ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా రూ.240 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో జైలర్ స్టార్ట్ చేశాడు. సూపర్‌స్టార్ 169వ సినిమాగా రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రూ.200 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా దూసుకెళ్తోంది. నెల్సన్ సినిమా అంటేనే కొంచెం డార్క్ కామెడీ.. కొంచెం యాక్షన్, కొంచెం థ్రిల్, కొంచెం భారీతనం కనిపిస్తాయి. స్టడీకామ్ షాట్స్, బ్లాక్డ్ షాట్స్ నెల్సన్ ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. నెల్సన్ ఫస్ట్ మూవీ కొలమావు కోకిల.. నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు సాధించింది.