ఫోన్ తెస్తే ‘పగులుద్ది’ మహేష్, ప్రియాంకలకు జక్కన్న వార్నింగ్
రాజమౌళి సినిమాలో ఏమున్నా ఏం లేకపోయినా జనాలు మాత్రం హడావుడి గట్టిగా చేస్తారు. సినిమాకి సంబంధించి చిన్న ఎనౌన్స్మెంట్ వచ్చినా సరే దాని గురించి సోషల్ మీడియాలో రచ్చరచ్చవుతుంది. ఇక రాజమౌళి కూడా తన సినిమాలకు ఉన్న హైపును దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు.
రాజమౌళి సినిమాలో ఏమున్నా ఏం లేకపోయినా జనాలు మాత్రం హడావుడి గట్టిగా చేస్తారు. సినిమాకి సంబంధించి చిన్న ఎనౌన్స్మెంట్ వచ్చినా సరే దాని గురించి సోషల్ మీడియాలో రచ్చరచ్చవుతుంది. ఇక రాజమౌళి కూడా తన సినిమాలకు ఉన్న హైపును దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న రాజమౌళి ఈ సినిమా గురించి ప్రతి ఒకటి జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కు వెళ్లడానికి రెడీ అయింది.
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం వర్క్ చేసిన రాజమౌళి ఇప్పుడు సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు అనౌన్స్ చేసిన జక్కన్న.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశాడు. హాలీవుడ్ లో కూడా బిజీగా ఉంటున్న ప్రియాంక చోప్రా ఈ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తోంది. దాదాపు 30 కోట్లు తీసుకుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి పక్క లెక్కలతో ఎక్కడ మిస్టేక్ జరగకూడదని అడుగులు వేస్తున్నాడు.
ముఖ్యంగా సినిమా గురించి ఏ చిన్న లీక్ కూడా బయటకు రావద్దని రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. అందుకే సినిమా షూటింగ్ లో ఏ ఒక్కరు ఫోన్ తీసుకురావద్దంటూ వార్నింగ్ ఇచ్చేసాడు. అది మహేష్ బాబు అయినా ప్రియాంక చోప్రా అయినా ఇంకెవరైనా సరే ఫోన్ మాత్రం షూటింగ్స్ స్పాట్ కు తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేసాడట. అలాగే యాక్టర్స్ పక్కన వచ్చిన హెల్పర్స్ కూడా ఫోన్ తీసుకురావద్దని… ఫోన్ సెట్స్ లోకి తీసుకొస్తే షూటింగ్ అయిన తర్వాతనే వాటిని తీసుకోవాలని ఒక సపరేట్ లాకర్ కూడా పెడుతున్నాడట.
భారీ బడ్జెట్ సినిమా కావడంతో చిన్న లీక్ అయిన సరే అది సినిమాకు మైనస్ అవుతుంది. అందుకే జక్కన్న ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఫోన్ తీస్తే కచ్చితంగా పగులుద్దని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక కథ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథా రచయిత తమ తండ్రి కే విజయేంద్రప్రసాద్ చెప్పిందే తప్ప దర్శకుడుగా రాజమౌళి ఎక్కడ మార్పులు చెప్పలేదని సమాచారం. ఇక సినిమా యూనిట్ కు గట్టిగానే వార్నింగ్ లు వెళ్ళినట్లు టాక్. సినిమాలో యాక్టర్స్ తో పాటుగా టెక్నీషియన్స్ తో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక సినిమా గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడొద్దని జక్కన్న ముందే వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. సినిమా షూటింగ్ టైంలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పేసాడట.