జక్కన్న బాహుబలి ఫార్ములా, మహేష్ కు 5 ఏళ్ళు ఖాయం
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఇప్పుడు రాజమౌళి సినిమాలు అంటే భయం పట్టుకుంది. ఆయనతో సినిమా చేయడం అంటే సాధారణ విషయం కాదు అనే అభిప్రాయానికి ఇప్పటికే మన స్టార్ హీరోలు వచ్చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్ అయితే జక్కన్న పేరు వింటే ఆమడ దూరం పరిగెడుతున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఇప్పుడు రాజమౌళి సినిమాలు అంటే భయం పట్టుకుంది. ఆయనతో సినిమా చేయడం అంటే సాధారణ విషయం కాదు అనే అభిప్రాయానికి ఇప్పటికే మన స్టార్ హీరోలు వచ్చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్ అయితే జక్కన్న పేరు వింటే ఆమడ దూరం పరిగెడుతున్నారు. సినిమాను ఏడాది లేదా రెండేళ్ళు… కాని ఒక్కసారి మైక్ పట్టుకుని యాక్షన్ అని చెప్పడం మొదలుపెడితే 5 ఏళ్ళు ఖాయం. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ దాదాపు ఆరేళ్ళ పాటు కష్టపడ్డాడు… రెండు పార్ట్ లు చేసాడు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇద్దరు హీరోలు కాబట్టి రెండు సినిమాలు అనుకున్నాడో ఏమో… దానికి తోడు కరోనా కూడా కలిసి వచ్చి… నాలుగేళ్ల సమయం పోయింది. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు బీటెక్ పూర్తై జాబ్ లు కూడా కొట్టారు. ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలను ప్రీ స్కూల్ కి కూడా పంపారు. అయినా సినిమా మాత్రం విడుదల కాలేదు ఆర్ఆర్ఆర్. ఎప్పుడో 2022 లో విడుదల చేసాడు జక్కన్న. 2017 చివర్లో మొదలుపెట్టిన సినిమా అది. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు కూడా అదే వైద్యం ఉండే అవకాశం ఉంది.
మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమాను జక్కన్న ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూట్ మొదలయింది కూడా. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ లుక్ కూడా పూర్తిగా మారింది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబు… జక్కన్న విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నాడు అని టాక్. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా పాగా వేయాలని భావిస్తున్న జక్కన్న… రెండు భాగాలతో రంగంలోకి దిగాలని భావిస్తున్నాడు. దీనికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకసారి సైన్ చేస్తే 5 ఏళ్ళ సమయం జక్కన్నకు రాసి ఇవ్వడమే.
ఇప్పుడు మహేష్ బాబు దాదాపుగా తన జీవితంలో అయిదేళ్ళ సమయాన్ని జక్కన్నకు రాసి ఇచ్చేసాడు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 2030 లో పూర్తైనా గొప్పే. కథ పెద్దది కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నారట. ఒక పార్ట్ లో చెప్పడం సాధ్యం కాదు కాబట్టే రెండు పార్ట్ లు అని నిర్ణయం తీసుకుని మొదలుపెట్టారట. ఒకవేళ ఈ రెండు హిట్ అయితే ఇంకో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారట. అది కూడా ఉంటే 2034 వరకు వెయిట్ చేయడమే మరి. ఏది ఎలా ఉన్నా మార్కెటింగ్ లో కింగ్ అయిన జక్కన్న… ఈ విషయంలో ఎలా అడుగులు వేస్తాడో చూడాలి.