SSMB29 : జక్కన్న టెక్నికల్ క్రూ ఫిక్స్

సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 11:06 AMLast Updated on: Feb 13, 2024 | 11:06 AM

Jakkanna Technical Crew Fix

సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌ బాబు (Mahesh Babu) – దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. నెలకొన్నాయి. ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ గతంలోనే రాజమౌళి చెప్పారు. ఇక ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక.. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో నటించబోయే నటీనటులతో పాటు.. టెక్నికల్ క్రూ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది..ఈ వార్త నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది.

ప్పటికే ఈ మూవీ కోసం మహేష్ బాబు మేకోవర్ పరంగా బాడీ పెంచడంతో పాటు గడ్డం, క్రాఫ్ కూడా పెంచుతూ స్టైలిష్ గా సిద్ధం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. ప్రస్తుతం ఫుల్ జుట్టు, గడ్డం ఉన్న మహేష్ కొత్త లుక్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ మూవీ టెక్నీకల్ క్రూ వీరే అంటూ ఒక న్యూస్ అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎడిటర్ గా తమ్మిరాజు, సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఆర్ సి కమల కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ గా రమా రాజమౌళి ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

మరో వైపు ఈ మూవీ కోసం ఓ ఇండోనేషియా (Indonesia) బ్యూటీని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ ఈ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్, కొరియన్, ఇండోనేషియన్ సినిమాల్లో నటించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో రాజమౌళిని ఫాలో అవుతోంది. దీంతో కచ్చితంగా రాజమౌళి ఆమెని అప్రోచ్ అయి ఉంటాడు, ఆమె ఓకే చెప్పింది అందుకే రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఆల్రెడీ RRR సినిమాలో కథకు తగ్గట్టు వేరే దేశాల యాక్టర్స్, హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు. సో.. ఈ మూవీలో కూడా కచ్చితంగా వేరే దేశాల యాక్టర్లు ఉంటారని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ లేటెస్ట్ న్యూస్‌ల పై ఆ మూవీ మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.