Titanic: విషాదం.. టైటానిక్ నటుడు మృతి
టైటానిక్.. ఈ పేరు సినిమా లవర్స్‌కు ఓ ఎమోషన్. ఇంగ్లీష్ సినిమా అయినా.. అన్ని భాషల ప్రేక్షకులు ఈ మూవీని ఓన్ చేసుకున్నారు . దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి వచ్చేసిందీ మూవీ.. దీనికితోడు అదే టైటానిక్‌ను చూడడానికి వెళ్లిన సబ్‌మెరైన్ కూడా ఈ మధ్యే మునిగిపోయింది.
ఐదుగురు ప్రాణాలు విడిచారు. విషాదమో, ఆనందమో.. అభిప్రాయమో.. టైటానికి హాట్‌టాపిక్ అవుతూనే ఉంది ప్రతీసారి. టైటానిక్ మూవీలో నటించిన నటుడు కూడా కేన్సర్‌తో చనిపోవడం ఇప్పుడు.. సినిమా ప్రేమికులని విషాదంలో ముంచేస్తోంది. టైటానిక్’ నటుడు లేవ్ పాల్టర్ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్… లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో చనిపోయాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని పాల్టర్ కూతురు కేథరీన్.. మీడియాకు చెప్పింది. లేవ్ పాల్టర్ పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్.
రంగస్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన టైటానిక్ మూవీతో పాల్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు. పాల్టర్ మరణ వార్త తెలియగానే టైటానిక్ టీమ్‌తో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.