Pawan Kalyan : వారంలో రెండే రోజులట
జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM) గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా మొదలు పెట్టారు.

Jana Sena's Pawan Kalyan has taken charge as AP Deputy CM. Reviews have already started with the authorities.
జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM) గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా మొదలు పెట్టారు. ఇక నుంచి ఎక్కువ సమయం పరిపాలన కార్యకలాపాలకే వెచ్చించబోతున్నారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఇక పై నిత్యం ఏపి ప్రజల మధ్యలోనే ఉండబోతున్నారు. మరి ఇప్పటికే సెట్స్ పై ఉన్న పవన్ సినిమాల పరిస్థితేంటి.. అంటే, లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ లైన్లో పెట్టిన సినిమాల్లో ఓజి (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh), హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు చాలావరకు షూటింగ్ జరుపుకున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మేకర్స్. పవన్ కూడా ఈ సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా హరిహర వీరమల్లుకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఓ వార్త వినిపిస్తోంది.
వారంలో రెండు రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తానని నిర్మాతలకి మాట ఇచ్చారట పవన్. మిగతా రోజులు ప్రజల మధ్యలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఇలా అయితే.. ఈ సినిమాల షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అనేది చెప్పడం కాస్త కష్టమే. కానీ.. వీలైనంత త్వరగా పవన్ ఈ సినిమాలను కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే.. ఆల్మోస్ట్ ఈ సినిమాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ముందుగా హరిహర వీరమల్లు పూర్తి చేసి.. ఆ తర్వాత ఓజీ పూర్తి చేయనున్నారట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 2025లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. కానీ వారానికి రెండు రోజులు అంటే.. ఒక్క సినిమా కంప్లీట్ అవడానికి మూడు, నాలుగు నెలల సమయం పట్టేలా ఉంది. మరి ఈ సినిమాలను పవలన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి.