Pawan Kalyan: పవన్ విడాకుల వార్త పై జనసేన క్లారిటీ
మూడో భార్య అన్నా లెజ్నోవాకు పవన్ విడాకులు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి జనసేనవర్గాలు పరోక్షంగా క్లారిటీ ఇచ్చాయ్. పిల్లలను తీసుకొని లెజ్నోవా రష్యా వెళ్లిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. దీనికితోడు మెగా ఫ్యామిలీలో జరిగిన ఏ ఈవెంట్‌లోనూ లెజ్నోవా కనిపించకపోవడం.. విడాకుల వార్తకు మరింత బలం ఇచ్చినట్లు అయింది.

Janasena has given clarity to the campaign that Pawan Kalyan divorced his wife Anna Leznova
వరుణ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్‌లోనూ, వారాహి పూజా కార్యక్రమంలోనూ.. చివరికి రామ్‌చరణ్ కూతురు క్లీన్‌కారా బారసాలలోనూ పవన్ దంపతులు కనిపించకపోవడంతో.. ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఐతే ఈ ప్రచారానికి పరోక్షంగా సమాధానం ఇచ్చాయ్ జనసేన వర్గాలు. వారాహి యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, లెజ్నోవా పూజలు చేసిన ఫొటోను.. జనసేన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన పూజలో పవన్ దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను ఆ ఇద్దరు నిర్వర్తించారు. పవన్ కళ్యాణ్ దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లు అయింది. విడాకుల ప్రచారానికి జనసేన చెక్ పెట్టింది. దీంతో పవన్ దంపతులు పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పవన్ దంపతులు విడిపోతున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు చూసైనా మారండంటూ కామెంట్స్ పెడుతున్నారు.